మరో కాంగ్రెస్ నేతపై ఈడీ కన్ను!

Update: 2019-11-13 17:30 GMT
ఇప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జైల్లోనే ఉన్నారు. ఆ పై కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమారను అరెస్టు చేశారు. బెయిల్ ఇచ్చారు. ఇంకోవైపు కర్ణాటకలోనే ఈడీ వల వేట కొనసాగుతూ ఉన్నట్టుంది. ఆ మేరకు అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేతలపై ఈడీ నిఘా పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత పరవమేశ్వర పై ఐటీ దాడులు జరిగాయి. ఆయనపై నల్లధనం, ఆర్థిక నేరాల అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతలో మరో నేతను కూడా టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సారి వంతు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కేజే జార్జ్ పేరు వినిపిస్తూ ఉంది.

విదేశాల్లో ఆయన అక్రమ ఆస్తులను కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదలు మేరకు ఈడీ విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఉన్న తన కుటుంబ సభ్యుల పేర్ల మీద జార్జ్ భారీగా ఆస్తులు  కూడబెట్టారని ఈడీకి ఫిర్యాదులు అందాయట. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల చిట్టాపై విచారణ మొదలైనట్టుగా  తెలుస్తోంది.

ఇలా ఒక్కో కాంగ్రెస్ నేత ఈడీ వలలో చిక్కుకుంటూ ఉండటం రాజకీయంగా ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. డీకే శివకుమార ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నారు. అయితే ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ-ఈడీలు కోర్టును కోరుతూ ఉన్నాయి. ఇంతలోనే మరో సీనియర్ నేత జార్జ్ మీద కేసులు తెర మీదకు వస్తూ ఉండటం గమనార్హం!
Tags:    

Similar News