• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియా అంటే అంత చులకనా...

ఇండియా అంటే అంత చులకనా మేధావీ!

By - Tupaki Desk
Update: 2020-03-12 17:34 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ చైనాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. చైనా పొరుగునే ఉన్న మన భారత దేశం దీన్ని సమర్థంగానే ఎదుర్కొంటోంది. దేశంలో ఇప్పటివరకు 73 కేసులు నిర్ధారణయ్యాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నిరోధానికి సమర్థమైన చర్యలు చేపడుతున్నాయి. అయితే, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జిమ్ ఓ నీల్ మాత్రం కరోనా వైరస్ విషయంలో భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చైనా కంటే ముందు భారత్‌లో ఈ వైరస్ వచ్చి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు.

జిమ్ ఓ నీల్ గతంలో గొల్డ్‌మన్ సాక్స్‌కు నేతృత్వం వహించారు. బ్రిక్స్(BRICS) అనే పదాన్ని తొలుత ప్రయోగించింది కూడా ఆయనే. అలాంటి వ్యక్తి బాధ్యత మరిచి ఒక దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా కట్టడిలో చైనా చాలా వేగంగా, యుద్ధప్రాతిపదికన స్పందించిందంటూ పొగడ్తల వర్షం కురిపించిన ఆయన భారత్‌ లో తొలుత కరోనా వెలుగు చూసి ఉంటే అక్కడి ప్రభుత్వం చైనాలా ప్రతిస్పందించేది కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. పాశ్చాత్య దేశాలు కూడా చైనాను అనుసరించాలని సూచించారు. ‘‘కరోనా వైరస్ భారత్‌లో వెలుగు చూడనందుకు భగవంతుడికి ధన్యావాదాలు చెప్పాలి. అదే జరిగి ఉంటే చైనా స్థాయిలో భారత్‌ లో ఎన్నటికీ ముందుకు కదిలేది కాదు. అక్కడ ప్రభుత్వం కార్యకలాపాల స్థితి అలాంటిది. బహుశా.. చైనా పద్ధతుల్లోని మంచి ఇదేనేమో. ఆ మాట కొస్తే బ్రెజిల్ విషయంలోనూ ఇదే వాస్తవం.’ అని జిమ్ వ్యాఖ్యానించారు. జిమ్ వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్రంగానే స్పందించింది. భారత్ హై కమిషన్ మినిస్టర్ విశ్వేశ్ నెగీ దీనిపై స్పందిస్తూ జిమ్‌వి బాధ్యతారిహితమైన వ్యాఖ్యలని మండిపడ్డారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • jim 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS