చెవుల్లో జోరిగ మోతనా..అయితే అది కరోనా కావొచ్చు

Update: 2020-11-12 03:15 GMT
దగ్గు, జలుబు, అధికజ్వరం, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందులే అందరికీ తెలిసిన కరోనా లక్షణాలు ఇవే. కానీ కరోనా మహమ్మారి మాత్రం రోజుకో కొత్త లక్షణంతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చెవుల్లో ఏవైనా వింతశబ్ధాలు వినిపించినా అది కరోనా లక్షణేమనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల కరోనా సోకిన వారిలో చెవుల్లో వింతశబ్ధాలు వినిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. చెవుల్లో నుంచి శబ్దం మొదలై తలచుట్టూ కంపించినట్టుగా అనిపిస్తే మాత్రం అది కరోనా లక్షణం కావచ్చని వైద్యలు హెచ్చరిస్తున్నారు. చెవిలో రింగుమని మోగే శబ్దాన్ని (Tinnitus) అని పిలుస్తారు. కరోనా సోకిన వారిలో కొంతమందిలో చెవులు రింగమనడం, కంపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయట.

ఇటువంటి లక్షణాలతో కరోనా వచ్చిందంటే.. కరోనా తగ్గిపోయకకూడా వాళ్లలో ఈ లక్షణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  Frontiers in Public Health జర్నల్​లో ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించారు. అంగిలా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక బృందం నేతృత్వంలో బ్రిటన్ టిన్నిటస్ అసోసియేషన్, అమెరికన్ టిన్నిటస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. 48 దేశాల నుంచి అధ్యయనంలో పాల్గొన్న వారిలో 3,103 మందిలో ఈ చెవిలో రింగుమనే శబ్దం సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. కరోనా బాధితుల్లో 40 శాతం మంది ఈ లక్షణంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది.  యూకేలో చాలామందిలోనూ వినికిడి వంటి సమస్యలు అధికమైనట్టు 46 శాతం మంది వెల్లడించారు. ఉత్తర అమెరికాలో మాత్రం 29 శాతం మాత్రమే వినికిడి సమస్య ఉందని తెలిపారు.
Tags:    

Similar News