ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్ట్ లు , దిగ్బంధం

Update: 2020-11-02 13:10 GMT
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో మరింత రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి కేటీఆర్ నిన్న బీజేపీ శ్రేణులు హైదరాబాద్ లో విధ్వంసానికి కుట్రపన్నారన్న ఆరోపణలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. తాజాగా ముందస్తు సమాచారంతో బీజేపీ కార్యాలయంతోపాటు ప్రగతి భవన్, టీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.. పలువురు బీజేపీ నేతలు ముందస్తుగా అరెస్ట్ చేయడం కాకరేపింది. ఎల్బీనగర్, హయత్ నగర్, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనుమానించినట్టే హైదరాబాద్ లోని హయత్ నగర్ లో బీజేపీ నాయకులు చొచ్చుకొచ్చారు. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నిర్వహించారు. డీజీపీ ఆఫీస్, ప్రగతి భవన్ ముట్టడిస్తామని.. కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నేతలు భైటాయించారు, అరెస్టులు చేస్తూ తమ హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు.

ఈ క్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇలాగే అరెస్ట్ లు కొనసాగితే టీఆర్ఎస్ నేతలను ఎక్కడా తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో సామ రంగారెడ్డితోపాటు సీనియర్ నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి, 20 మంది కార్యకర్తలను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో బీజేపీ నేతల అరెస్ట్ తో అట్టుడుకుతోంది. దుబ్బాక ఎన్నికల వేళ ఇది మరింత అగ్గి రాజేస్తోంది.
Tags:    

Similar News