కూడికలు తీసివేతలతో నేతలు బిజీబిజీ
పోటాపోటీగా.. ఆ మాటకు వస్తే తొలుత ఉన్న అంచనాలకు భిన్నంగా దుబ్బాక ఉప ఎన్నిక మహా టైట్ గా సాగిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణంగా పోటాపోటీగా ఎన్నిక జరిగిన తర్వాత.. ఆ వేడి చాలానే ఉంటుంది.అయితే.. అదే రోజు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగటం.. ఓట్ల లెక్కింపు షురూ కావటంతో.. మీడియా ఫోకస్ మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల మీదనే ఉంది.
గడిచిన మూడు రోజులుగా ఇలాంటి పరిస్థితే ఉంది. తాజాగా ట్రంప్ ఓటమి మరింత స్పష్టం కాగా.. బైడెన్ గెలుపు ఖాయమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. తెలుగువారి చూపు దుబ్బాక మీద మళ్లీ పడుతోంది. ఇదిలా ఉంటే.. దుబ్బాకలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నాటి నుంచి ప్రధాన పార్టీలన్ని కూడా.. పోలింగ్ సరళిని విశ్లేషించటం.. తమ బలాలు.. బలహీనతల్ని లెక్క వేసుకోవటంతో పాటు.. ఎక్కడ తాము ముందంజలో ఉంటాం? ఎక్కడ వెనుక పడతామన్న అంశంపై ఇప్పటికు ఒక స్పష్టతకు వచ్చినట్లు చెబుతున్నారు.
ఆసక్తికరంగా దుబ్బాక ఫలితం మీద టీఆర్ఎస్.. బీజేపీలు ఆశలు సజీవంగా ఉంచుకుంటే.. కాంగ్రెస్ మాత్రం.. అనుకోని అద్భుతం జరిగితే.. తాము గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఇక.. పోటీ ఉంటుందని భావిస్తున్న టీఆర్ఎస్.. బీజేపీల మధ్య గెలుపుపై ఇరు పార్టీలు సమానమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 65 వేలకు పైగా మెజార్టీ కట్టబెట్టిన దుబ్బాక ఓట్లు ఈసారి ఉప ఎన్నికల్లో అంత అధిక్యత రానప్పటికీ.. విజయం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా 25 వేల నుంచి 35వేల మధ్యలో గెలుపు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ నేతల లెక్కలు మరోలా ఉన్నాయి. కాంగ్రెస్.. న్యూస్ యాంకర్ కత్తి కార్తీక లాంటి వారు అధికార టీఆర్ఎస్ ఓట్లను భారీగా చీల్చి ఉంటారని.. దీంతో తాము క్షేమంగా బయటపడతామన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మెజార్టీ భారీగా వచ్చే అవకాశం లేదని.. రఘునందనరావుపై ఉన్న సానుభూతి బీజేపీకి బలంగా మారనుందన్న మాట వినిపిస్తోంది. ఇలా.. టీఆర్ఎస్.. బీజేపీ నేతలు వేసుకుంటున్న లెక్కలు ఏ మేరకు నిజమవుతాయన్నది పదో తారీఖు ఉదయం పది గంటలకు ఒక కొలిక్కి వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.