చెమటలు కక్కుతున్నా.. హరీశ్ కు మిగులుతున్నది అంతేనా?
తెలంగాణ అధికారపక్షంలో గ్రూపుల ముచ్చట చాలా పాతది. చెబితే రామాయణం అన్నట్లుగా ఉండే ఈ కథలో ఎవరికి వారు గమ్ముగా ఉంటారు. చేయాల్సింది సైలెంట్ గా చేసేస్తుంటారు. తాజాగా జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల వేళ.. రాజకీయ వాతావరణం ఎంత హాట్ గా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దుబ్బాకలో బీజేపీ నేతల తీరుతో ఆగ్రహం చెందిన మంత్రి కేటీఆర్ అయితే.. ఏకంగా ప్రధాని మోడీకే వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారంటూ కమలనాథుల మీద కస్సుమన్న ఆయన.. తమకు ఓపిక నశిస్తే.. ప్రధాని మోడీని సైతం నిలదీస్తామని వ్యాఖ్యానించటం తెలిసిందే.
ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు మీడియాలో లభించిన ప్రాధాన్యం తెలిసిందే. మరోవైపు..దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీశ్ ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.చాలానే విషయాలు చెప్పారు. మిగిలిన మీడియా సంస్థల్లో ఒక మోస్తరు ప్రాధాన్యత మాత్రమే ఇచ్చింది. అదేం తప్పు అని కూడా చెప్పలేం. కానీ.. కేసీఆర్ సొంత మీడియా సంస్థలో హరీశ్ ప్రెస్ మీట్ కు లభించిన ప్రాధాన్యతపై పెదవి విరుపు వినిపిస్తోంది.
అంతలా చెమటలు చిందిస్తూ.. దుబ్బాక ఉప ఎన్నికను పర్సనల్ గా తీసుకొని.. బీజేపీ పై అంతలా పోరాడుతున్న వేళ.. ఆయన మాటలకు సొంత పత్రికలో లభించిన ప్రాధాన్యం అంత తక్కువేంటి?అన్న ప్రశ్న హరీశ్ వర్గంలో వినిపిస్తుండటం గమనార్హం. తెలంగాణ నూతన విద్యుత్ వాహన విధానానికి సంబంధించి ఒక రోజు పాత వార్తకు భారీ ప్రాధాన్యత లభించిందని..తమ నేత హరీశ్ ప్రెస్ మీట్ కు మొదటి పేజీలో ‘గింత’ స్పేస్ మాత్రమే కేటాయించటం ఏమిటన్న గుర్రు కనిపిస్తోంది. ఎంత కష్టపడినా.. మరెంత చెమటలు చిందించినా.. గింత దక్కే దానికి హరీశ్ అంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అన్న మాట పలువురి నోటి వినిపించటం ఇప్పుడు ఆసక్తికరంగామారింది. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా.. దుబ్బాక ఉప ఎన్నికల వేళలో అయినా.. హరీశ్ మాటలకు కేసీఆర్ సొంత మీడియాలో ప్రాధాన్యత మారితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.