చైనా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ రాజు

Update: 2020-11-04 13:30 GMT
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి  ఏడాది కావస్తున్నా కరోనా మహమ్మారి భయం మాత్రం ప్రపంచాన్ని వీడలేదు. యూరప్  దేశాల్లో వైరస్ సెకండ్ వేవ్ కనిపించడంతో చాలా దేశాలు మళ్లీ లాక్‌ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయితే , ఈ వ్యాక్సిన్ వస్తుంది వస్తుంది అని చెప్పడమే తప్ప , ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఈక్రమంలో చైనా నుంచి వ్యాపించి ఈ కరోనా మహమ్మారికి సంబందించిన వ్యాక్సిన్ చైనా తయారు చేసింది. ఈ క్రమంలో చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను దుబాయ్ రాజు వేయించుకోవటం విశేషంగా మారింది.

చైనా ప్రభుత్వానికి చెందిన ఫార్మా కంపెనీ సినోఫార్మ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం వేయించుకున్నారు. టీకా వేయించుకుంటుండగా తీసిన ఫొటోను షేక్ మహ్మద్ మంగళవారం తన ట్విట్టర్‌ లో షేర్ చేశారు. ప్రతీ ఒక్కరూ కరోనా నుంచి భద్రతగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. యూఏఈ ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు.

ఈ టీకా ప్రస్తుతం మూడో దశ పరీక్షల్లో ఉన్నప్పటికీ అత్యవసర ప్రాతిపదికన దుబాయ్ దీనిని వినియోగిస్తోంది. రాజుతోపాటు దుబాయ్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని కూడా టీకాను వేయించుకున్నారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరికీ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం యూఏఈలో ఇప్పటి వరకు 1,35,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 497 మంది మృత్యువాత పడ్డారు.
Tags:    

Similar News