గంజాయి మత్తులో భాగ్యనగరం చిత్తు
భాగ్యనగరాన్ని గంజాయి మత్తు కమ్మేస్తున్నది. యువత ఈ మత్తులో జోగుతున్నారు. గంజాయి మాఫియాకు కోట్లకు పడగెత్తుతున్నది. యువత మాత్రం ఈ మత్తుమందు మోజులో పడి తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరుగుతున్న గ్యాంగ్ వార్ లు, గొడవలకు గంజాయి వాడకమే కారణమని తెలిసి పోలీసులు విస్తుపోయారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగిపోతున్నది. మత్తు లో జోగుతున్న యువకులు నిత్యం గొడవలకు దిగుతున్నారు. మరో వైపు కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం గంజాయి వాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూల్ పిల్లల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల వరకు గంజాయి బాధితులు ఉన్నారు. ప్రతిరోజు నగరంలోని ఏదో ఓ చోట గంజాయి కొద్దిమొత్తంలో పట్టుబడుతూనే ఉంది. అయినప్పటికీ భారీ స్థాయిలో గంజాయి హైదరాబాద్‌కు వస్తున్నట్టు టాక్
గొడవలకు మూలాలు వెతికితే షాకింగ్ నిజాలు
హైదరాబాద్‌లోని అఫ్జల్‌ఘంజ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, అంబర్‌పేట్, ముసారాంబాగ్ ప్రాంతాలలో ఇటీవల నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలకు అసలు కారణం గంజాయే అని తెలిసి పోలీసులు షాక్‌కు గురవుతున్నారు. నగర శివారులోని బాలాపూర్ పీఎస్ పరిధిలో కూడా ఓ యువకునిపై హత్యాయత్నం జరిగింది. షాహిన్ నగర్‌కు చెందిన అమేర్ అనే యువకునిపై సద్దామ్ అనే రౌడీ షీటర్ గంజాయి మత్తులో కత్తులతో దాడి చేశాడు. ఈ దాడుల వెనక గంజాయి పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి గంజాయికి బానిసైన యువకులు మత్తులో హత్యలు, హత్యాయత్నాలకు కూడా వెనకాడటం లేదని అందువల్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.