ట్రంప్ వెన్నంటే కూతురు - అల్లుడు - స్టీరింగ్ వారి చేతుల్లో
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్... మనసు - మాట అంతా ఘాటుగా ఉంటుంది. అమెరికాపై భక్తి. అమెరికాలో ఉంటే విదేశీయులపై ఆగ్రహం ఉన్నట్లుగా కనిపిస్తారు. అలాగే అమెరికాపై కాలు దువ్వాలి అనుకునే నార్త్ కొరియా వంటి దేశాలకు ధీటుగా సమాధానం చెబుతారు. ఆయన తనకు తోచింది అలా మాట్లాడుతారు. అందుకే ఆయన కొన్ని మాటలు వివాదాస్పదమవుతుంటాయి. ఆయితే ఆయన నోరు జారకుండా.. ఆయన నిర్ణయాల్లో దూకుడుకు కళ్ళెం వేస్తారు.. కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్. గత ఎన్నికల సమయంలో వీరు ఆయన వెన్నంటే ఉన్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ఒకరు ట్రంప్ వెంట ఉంటే, మరొకరు సోషల్ మీడియా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ట్రంప్‌కు వీరిద్దరిని పవర్ స్టీరింగ్‌గా అభివర్ణిస్తారు.
కూతురు ఇవాంకా అంటే డొనాల్డ్ ట్రంప్ కు ఎంతో ప్రేమ. వ్యాపార వేత్తగా, మోడల్ గా సుపరిచితురాలు. వర్చచే, టామీ హిల్ ఫిగర్ వంటి వాటికి మోడల్‌గా పని చేశారు. ఆమె గతంలో హైదరాబాద్ లో పర్యటించారు. 2017లో ఇండియా లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్ సమావేశానికి వచ్చారు. అహ్మదాబాద్ మొతేరా స్టేడియం లో జరిగిన కార్యక్రమం లో దీనిని గుర్తు చేశారు. గత ఎన్నికలకు ముందు ట్రంప్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఇవాంకా తిప్పి కొట్టారు. కుష్నర్ హార్వార్డ్ లో ఎంబీయే - న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. ఆయన రియల్ ఎస్టేట్ అధిపతి తనయుడు.
2005లో ఇవాంకతో కుష్నర్ కు పరిచయం ఏర్పడింది. 2009లో వారు పెళ్లి చేసుకున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రోలింగ్ - సెంటిమెంట్ - మిషన్ లర్నింగ్ వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా మలిచారు కుష్నర్. 2020 ఎన్నికల్లోను ఆయన తనదైన పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ కార్య నిర్వాహక బృందంలో వీరిద్దరు తప్పకుండా ఉంటారు. తాజా భారత పర్యటన లో చివరి నిమిషం లో అతిథుల బృందం లో చేరారు.
ట్రంప్ గెలిచిన కొన్నాళ్లకు రాజకీయ సలహాదారుగా కుష్నర్ ను - ఆ తర్వాత ఇవాంకను సీనియర్ అడ్వయిజర్ గా నియమించడంతో బంధుప్రీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిద్దరు వారి బాధ్యతలు నిర్వర్తిస్తూనే వేతనాలు వదులుకున్నారు. నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ తో చర్చల సమయంలో - జీ20 సమ్మిట్ లో ఇవాంక తన తండ్రి వెంటే ఉన్నారు.
జీ20 సదస్సులో ట్రంప్ - మోడీ - జపాన్ ప్రధాని షింజో అబే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే అదే సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షులు - బ్రిటన్ ప్రధాని - ఐఎంఎఫ్ చీఫ్ చర్చల్లో ఇవాంకా కల్పించుకోవడం విమర్శలకు తావిచ్చింది. తమ వ్యాపారాలకు దూరంగా ఉంటూ ట్రంప్ పై విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు.
ట్రంప్ కీలక విధులను కుష్నర్ పంచుకున్నారు. మధ్యప్రాచ్యం - అరబ్ దేశాల వ్యవహారాలను చూశారు. అలాగే, ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కుష్నర్ పై ఇజ్రాయెల్ పక్షపాతి అనే ఆరోపణలున్నాయి. అధ్యక్షుడు మంజూరు చేసే క్షమాభిక్ష అధికారాన్ని ఇటీవలే కుష్నర్ కు అప్పగించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇండియా విషయంలో కుష్నర్ కొంత సానుకూలం గా ఉంటారని అంటారు. కాలేజీ రోజుల్లో భారతీయులతో కలిసి చదువుకున్నారు. రెండేళ్ల క్రితం స్నేహితుడి పెళ్లి కోసం భారత్ వచ్చారు. భారతీయ సంస్కృతి పై అవగాహన ఉంది. ఇండియాను వ్యూహాత్మక భాగస్వామి గా, వ్యాపార భాగస్వామి గా భావిస్తున్నారు. ఇటీవల అమెరికా - భారత్ మధ్య వ్యాపార ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరిపించి, తద్వారా అగ్రరాజ్యం గ్రామీణ రైతుల ఓటు బ్యాంకును కాపాడుకునే వ్యూహంలో భాగంగా కూడా తాజా పర్యటన ను చెబుతారు. దీనికి మూలం కుష్నర్ అంటున్నారు.