అమెరికాలో అలా జరుగుతుందా? షాకింగ్ గా కమలా హారిస్ ఇంటి తిప్పలు

Update: 2021-03-30 04:30 GMT
అలసత్వం కొన్ని దేశాలకే పరిమితం కాదని.. అగ్రరాజ్యానికి.. అందునా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి తప్పదన్న షాకింగ్ నిజం తాజాగా వెల్లడైంది. దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మనమ్మాయ్ కమలా హరిస్ కు కేటాయించిన అధికార నివాసంలోకి ఆమె ఇప్పటికి వెళ్లలేకపోతున్నారు. దీనికి కారణం.. అందులో జరుగుతున్నరిపేర్లుగా చెబుతున్నారు. సాధారణంగా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారికి కేటాయించిన అధికారిన నివాసాల్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తారు. పనులు పరుగులు తీస్తాయి. అందుకు భిన్నంగా కమలా విషయంలో చోటు చేసుకున్న వైనం చూస్తే.. ఆగ్రరాజ్యంలోనూ ఇంత నిర్లక్ష్యం.. అలక్ష్యమా? అన్న సందేహం కలుగక మానదు.

అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా జనవరి 20న ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుల వారు వైట్ హౌస్ కు షిఫ్టు అయ్యారు. ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన వారికి నావల్ అబ్జర్వేటరీలో అధికార నివాసాన్ని కేటాయించారు. వాటికి రిపేర్లు జరుగుతున్నాయన్న కారణంగా ఆమె .. అధ్యక్షుల వారి గెస్టు హౌస్ అయిన బ్లెయిర్ హౌస్ లో ఉంటున్నారు. సూట్ కేసుల్లో ఉన్న సామాన్లను ఎప్పటికప్పుడు తీసుకుంటూ వాడుతున్నారు.

ఇంటి రిపేర్ పూర్తి అవుతుందన్న మాట.. రెండు నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవటం సంచలనంగా మారింది. ఇటీవల ఆమె ఇంటి మరమ్మతుల్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెకు ఎంతో ఇష్టమైన కిచెన్ కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అయితే.. ఇప్పటివరకు వాటిని రిపేర్లు చేసే కాంటాక్టు సంస్థ పట్టించుకోలేదని చెబుతున్నారు అధికార నివాసంలో చేపట్టాల్సిన రిపేర్లు మొత్తం ప్లంబింగ్.. హీటింగ్.. ఎయిర్ కండీషనింగ్ కు మాత్రమేనని.. వాటి కోసం ఇంతకాలం ఎందుకు పడుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఎందుకింత ఆలస్యమవుతున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దేశ ఉపాధ్యక్షురాలికే ఇలాంటి పరిస్థితి.. అందునా అమెరికాలో ఉండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
Tags:    

Similar News