మరో రెండు సంస్థలకు కేంద్రం ‘ప్రైవేట్’ స్పాట్ పెట్టిందా?

Update: 2021-02-22 05:32 GMT
ఒక వ్యక్తికి ఉండే ఆస్తుల గురించి ప్రతిఒక్కరికి క్లారిటీ ఉంటుంది. మరి.. అదే ప్రభుత్వం విషయానికి వస్తే..? ఒకటి భూములు.. రెండోది ప్రభుత్వ రంగ సంస్థలు. డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భూములు అదే పనిగా అమ్మేయటం.. మరోవైపు నష్టాల బూచి చూపించి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయటం ఈ మధ్యన ఎక్కువైంది. మోడీ సర్కారు ప్రైవేటుద్వారాల్ని తీయటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ప్రపంచంలోని ఇన్ని సంస్థలు లాభాల్లో నడుస్తున్న వేళ.. ప్రభుత్వం నడిపే సంస్థల్లో ఎందుకు లాభాల్లోకి రావు? దానికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? లాంటి ప్రశ్నలతో పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి.. ప్రైవేటు సంస్థలకు అదే పనిగా అప్పజెప్పేసి.. వారిచ్చే కాసుల్ని సంక్షేమ పథకాల కోసం ఖర్చుచేసేస్తే. పాతికేళ్ల తర్వాత అమ్మటానికి ఏముంటుంది? అప్పుడీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అన్నది అసలు ప్రశ్న.

ఓవైపు ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు మోడీ సర్కారు ఓకే చేయటం.. దానిపై తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రైల్వేలను దశల వారీగా అమ్మకానికి పెట్టేసిన మోడీ సర్కారు.. టెలికాం.. ఎల్ఐసీతో సహా పలు సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఇవి సరిపోనట్లు.. తాజాగా మరో రెండు సంస్థల్ని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.

ఈ జాబితాలో ఓరియంటల్ ఇన్సూరెన్స్.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ప్రైవేటీకరణ చేపట్టేందుకు ఈ రెండు కంపెనీల గురించి కేంద్రంలోని మోడీ సర్కారు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రైవేటీకరణ చేపడుతూ పోతే.. రాబోయే రోజుల్లో మిగిలేది.. పరిపాలనే. దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేస్తారా ఏంది?
Tags:    

Similar News