ఢిల్లీ హింస..13మంది మృతి.. లేట్ గా మేల్కొన్న అమిత్ షా

Update: 2020-02-26 05:30 GMT
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం మంటలు మళ్లీ అంటుకున్నాయి. ఈశాన్య ఢిల్లీని రణరంగంగా మార్చేశాయి.  ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసలో ఏకంగా 13మంది చనిపోవడంతో కేంద్రం మేల్కొంది. అమిత్ షా ఆగమేఘాల మీద పోలీస్ ఉన్నతాధికారులతో శాంతి భద్రతలపై సమీక్షించారు. మంగళవారం రాత్రంతా ఈ భేటి కొనసాగింది. గవర్నర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ భేటిలో పాల్గొన్నారు.

బీజేపీ నేత కపిల్ మిశ్రా ఓ వర్గంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలే తాజా హింసకు కారణమయ్యాయి. ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులపై యాసిడ్ దాడి చేశారు. రాళ్లు, కర్రలు ప్రయోగించారు.ఇరువర్గాలు చేసుకున్న కాల్పుల్లో 13మంది మరణించగా.. దాదాపు 100 మందికిపైగా గాయాలయ్యాయి.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.  ఈశాన్య ఢిల్లీలో శాంతిని పునరుద్దరించడానికి రాజకీయ పార్టీలు చేతులు కలపాలని.. శాంతిని పాటించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే ప్రసంగాలు మానాలని కోరారు.

కాగా ఓ వైపు ఢిల్లీ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతుండగానే ఆందోళనలు పెచ్చరిల్లడం.. 13మంది చనిపోవడం కేంద్రానికి గుబులు రేపింది. అమిత్ షా ఆగమేఘాల మీద దీనిపై సమీక్షించారు.
Tags:    

Similar News