కరోనా కల్లోలం: ప్రతీ 100మందిలో ముగ్గురు మృతి
కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని ఆవహించింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనజీవనం అల్లాడుతోంది. వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 5,26,105 కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్తం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 11,587 మంది మృతి చెందారు.
ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం మీద 6,00,71,318 కరోనా కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 14, 13,668కి చేరింది. ప్రస్తుతం రెండో వేవ్ లో మొదటి సారి విస్తరించిన దానికంటే మించి కేసులు నమోదవుతున్నాయి.
ఈ లెక్క చూస్తే ప్రతి 100 మందిలో ఇద్దరు నుంచి ముగ్గురు కరోనాతో మృతి చెందుతున్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే నిన్న ఒక్కరోజే 1,65,163 కొత్త కేసులు నమోదయ్యాయి. 2121 మంది కరోనాతో మృతి చెందారు.
యూరప్ తోపాటు అమెరికాలో ఇప్పుడు శీతాకాలం మంచు కురుస్తుండడంతో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. భారీగా కరోనా కేసులతో అమెరికా తీవ్రంగా నష్టపోతోంది. రెండో దశలో కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నది.