• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 31 గురువారం 2019...

జనవరి 31 గురువారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-31 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: వ్యవహారాలు మందకొడిగా ఉంటాయి. రాబడి అంతగా ఉండదు. కుటుంబ సమస్యలతో చికాకు. రియల్టర్లు, కాంట్రాక్టర్ల అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు నిరాశాజకం ఉంటాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక - కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం దక్కదు. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు మానసిక ఆందోళన. గణేషుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: రాబడి సంతృప్తికరం. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. రియల్టర్ల యత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే సూచనలు. కళాకారులు, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు శుభ సమాచారం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: అప్పుల  బాధలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రియల్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు  విస్తరిస్తారు. ఉద్యోగులకు ఆశించి పోస్టులు దక్కే అవకాశాలు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకోని విదేశీయానం. మహిళలు అనుకున్నది సాధిస్తారు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ సమస్యలతో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు పెరుగుతాయి. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొంత అనుకూలమైన సమయం. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు శ్రమిస్తే ఫలితం దక్కుతుంది. మహిళలకు సోదరులతో సమస్యలు. లక్ష్మీదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: ప్రత్యర్థుల నుంచి విమర్శలు. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సి వస్తుంది. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకులు పరుస్తాయి. రాజకీయ నాయకులు, కళాకారులు ప్రతి  విషయంలోనూ అప్రమత్తతతో ఉండాలి. ఐటీ నిపుణులకు ఒక సమాచారం నిరాశ కలిగిస్తుంది. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు ఆస్తి వివాదాలు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభవార్తలు వింటారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చాకచాక్యంగా సమస్యల నుంచి బయటపడుతారు. పట్టుదల పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో శుభకార్యాలు. దత్తాత్రేయుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విరోధాలు. వృథా ఖర్చులు. రాబడి తగ్గుతుంది. ఆదాయం అంతగా ఉండదు. కొన్ని పనులు  వాయిదా వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. వ్యాపారులకు సామన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థాన మార్పు ఉంటుంది. కళాకారులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థులకు నిరాశాజకం. మహిళలకు మాటపట్టింపులు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

వృశ్చిక రాశి: అదనపు ఆదాయం చేకూరుతుంది. మీ సత్తా చాటుకుంటారు. ఆత్మీయులు చేరువవుతారు. ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు శుభవార్తలు. వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతాయి. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. మహిళలకు ఆకస్మిక ధనలాభం. ఐటీ నిపుణుల యత్నలు ఫలిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు కలిసివస్తాయి. లక్ష్మీదేవీని స్తుతించడం మంచిది.

ధనస్సు రాశి: బంధువర్గంతో విబేధాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రావాల్సిన బాకీలు అందవు. కొత్త రుణాలు చేస్తారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు కొంత గందరగోళం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు. రాజకీయ, కళారంగాల వారికి నిరాశ తప్పదు. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థుల శ్రమిస్తే ఫలితాలు దక్కుతాయి.  మహిళలకు సోదరులతో కలహాలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మకర రాశి: పరిశోధనలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు నెమరువేసుకుంటారు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులు, రాజకీయ రంగాలవారికి ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభం. దుర్గామాత స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. మీ చాతుర్యంతో పనులు చేసుకుంటారు. మీ మాటకు తిరుగుండదు. ఆర్థి పరిస్థితి ఆశాజనకంగా  ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి అరుదైన పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మహిళలకు భూ లాభాలు. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశాజకం. పనుల్లో ఆటంకాలు. ఆప్తులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. కోర్టు కేసులు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాల్లో తొందపాటు వద్దు. ఉద్యోగాలు లక్ష్యాలు సాధించడంలో వెనుకబడతారు. కళాకారులు, రాజకీయ రంగాల వారికి  అవకాశాలు చేజారుతాయి. ఐటీ నిపుణులకు  గందరగోళ పరిస్థితులు. విద్యార్థుల యత్నాలు ఆటంకాలు. మహిళలకు మానసిక అశాంతి. గణపతిని ఆరాధించడం మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

తల్లి, చెల్లి అనే తేడా లేదా.. జగన్ సైతాన్ సైన్యానికి పచ్చరోగం.. ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

2026-11-17 12:45 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?

2026-11-17 10:31 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

రాహుల్ మనసులో మాట.. ఎవరా లక్కీ గర్ల్? నెట్టింట మొదలైన వేట!

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

Copyright @2026

Powered by Blink CMS