• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 28 సోమవారం 2019...

జనవరి 28 సోమవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-28 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. రాబడి అనుహ్యంగా పెరుగుతుంది. పనుల్లో సానుకూలత ఉంటుంది. అందరికీ అమోదయోగ్య నిర్ణయాలు తీసుకుంటారు. రియల్టర్ల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి. విద్యార్థులకు అవకాశాలు కలిసొస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవ - మర్యాదలు దక్కుతాయి. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: సంఘంలో గౌరవం దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. ఐటీ ఉద్యోగులకు ముఖ్య సమాచారం చేరుతుంది. రాజకీయ - కళారంగాల వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు గౌరవం లభిస్తుంది. గణేశాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతారు. రియల్టర్లు కొంత ఆందోళనకు గురవుతారు. ఉద్యోగులకు పనిభారం. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. రాజకీయ - కళారంగాల వారికి అవకాశాలు అంతగా కలిసిరావు. విద్యార్థులకు చికాకులు. మహిళల అంచనాలు తారుమారవుతాయి. విష్ణుధ్యానం చేయడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. బంధుమిత్రులతో తగాదాలు. కాంట్రాక్టర్లు - రియల్టర్లకు ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం. విద్యార్థులకు నిరుత్సాహం. ఐటీ ఉద్యోగుల యత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరాశాజనకం. మహిళలకు ఆస్తి వివాదాలు. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కన్యారాశి: సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలు నిరాశాజకంగా సాగుతాయి. రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. రియల్టర్లకు సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దయ్యే అవకాశం. ఐటీ నిపుణులకు వివాదాలు. విద్యార్థులకు సమస్యలు అధిగమవుతాయి. మహిళలకు ఆస్తి వివాదాలు. కనకదుర్గా స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రియల్టర్ల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు దూరమవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా కలిసివస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు సోదరులతో సఖ్యత నెలకొంటుంది. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: నూతన ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. ఎంత శ్రమించిన ఫలితం దక్కదు. మిత్రులతో తగాదాలు నెలకొంటాయి. రియల్టర్లు కేసులను ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహాణలో ఆటంకాలు. రాజకీయ, వ్యవసాయ రంగాల వారికి శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు చికాకులు. మహిళలకు మానసిక ఆందోళన. గణేశాష్టకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అప్రయత్నంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక, వస్తు లాభాలున్నాయి. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగుల సేవకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి అనుహ్య అవకాశాలు, ఆహ్వానాలు ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు పురస్కారాలు దక్కుతాయి. విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. కుటుంబీకుల నుంచి సహకారం లభిస్తుంది. మిత్రులతో కష్టసుఖాలను విచారిస్తారు. కాంట్రాక్టర్లకు సమస్యల నుంచి విముక్తి దక్కుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఐటీ నిపుణులకు అనుకూల సమయం. పారిశ్రామిక, కళారంగాల వారికి అరుదైన పురస్కారాలు దక్కుతాయి. విద్యార్థులకు అవకాశాలు అధికమవుతాయి. మహిళలకు సోదరుల నుంచి శుభవార్తలు చేరుతాయి. ఆదిత్య హృదయం పఠించం మంచిది.

కుంభరాశి: కొన్ని అవకాశాలు చేజారతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు మీపై నిందలు వేస్తారు. రియల్టర్ల అంచనాలు తప్పుతాయి. వ్యాపారాల్లో లాభాలు సంతృప్తికరంగా ఉండవు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు మరిన్ని చిక్కులు. విద్యార్థుల యత్నాలు ఫలించవు. మహిళలకు బంధు విరోధాలు. గణేశాష్టకం పఠించడం మంచిది.

మీనరాశి: రాబడి తగ్గి రుణాల కోసం యత్నిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు. అంచనాలు తప్పుతాయి. మిత్రులు, బంధువులతో విరోధాలు. రియల్టర్లు కోర్టు వివాదాలతో నిరాశ చెందుతారు. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు. రాజకీయ - కళారంగాల వారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు చికాకులు. మహిళలకు సోదరులతో వివాదాలు నెలకొంటాయి. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా 'లిప్ కిస్' అడిగాడు.. తర్వాత చూడాలి..

2026-11-17 06:51 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

విజయ్ కు అందలం.. సీఎంలు రేవంత్, డీకే, సతీషన్ కు మంగళం.. ఇలా చేస్తే కాంగ్రెస్ ను అనరా మరీ..

2026-11-17 04:40 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

దివాళా తీసిన 'బైజుస్' ఆస్తులు కొన్న మీషో అధినేత‌.. 84 కోట్లు రిస్క్ చేసారా?

2026-11-17 04:09 GMT

ఎల‌క్ట్రిక్ విప్ల‌వంతో పెట్రోల్- డీజిల్ వినియోగం త‌గ్గిందా? వాస్త‌వం తెలిస్తే షాకింగే!

2026-11-17 04:08 GMT

23 లో వైసీపీ ఆశలు...టఫ్ ఫైట్ ఖాయమా ?

2026-11-17 04:07 GMT

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

రాహుల్ నవ్వులపాలు కావొద్దు.....బీజేపీ హితవు వెనక ?

2026-11-17 04:06 GMT

చైనాకు చెక్: AI సప్ల‌య్ చైన్ ర‌క్ష‌ణ‌కు భార‌త్ స‌హా 9 దేశాల ఒప్పందం!

2026-11-16 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS