• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 10 గురువారం 2019...

జనవరి 10 గురువారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-10 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న రీతిలో పనులు సాగవు. ఆలోచనలు అమలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చిక్కులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. విద్యార్థులకు నిరాశాజనకం. ఐటీ ఉద్యోగుల శ్రమ వృథాగా మారుతుంది. మహిళలకు మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్వేశ్వరుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆదాయం సంతృప్తకంగా ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. జీవితాశయం నెరవేరుతుంది. ప్రత్యర్థులు మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం. కళాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. శ్రీ రామ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: ఆర్థికపరమైన ఇబ్బందులుంటాయి. రుణాలు చేస్తారు. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు వ్యవహారాల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కదు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. కుటుంబంలో వ్యతిరేకతలు నెలకొంటాయి. బంధువులతో విరోధాలు. దీర్ఘాకాలిక సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు చికాకులు తప్పవు. ఐటీ నిపుణులకు మరింత శ్రమించాలి. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు సోదరులతో కలహాలు. శివాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు అనుకోని అవకాశాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టర్లకు మరింత ఆశాజనకం. శుభకార్యాలకు డబ్బులు వెచ్చిస్తారు. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

కన్యారాశి: ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. కొత్త విద్యావకాశాలు పొందుతారు. ఆహ్వానాలు, గ్రీటింగ్స్ అందుకుంటారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు సోదరులతో సఖ్యత నెలకొంటుంది. గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: పనుల్లో అవాంతరాలు నెలకొంటాయి. ప్రతిభ ఉన్నా తగిన గుర్తింపు కష్టమే. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక అశాంతి. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: పనుల్లో అవాంతరాలు నెలకొంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వివాదాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు సమస్యలు. ఐటీ నిపుణుల అంచనాలు తారుమారవుతాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి గందరగోళ పరిస్థితులు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితులు అన్నివిధలా సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఐటీ నిపుణుల విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. విద్యార్థులకు నిరాశాజనకం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులు, రాజకీయ వర్గాలకు నూతన అవకాశాలు వస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు నెలకొంటాయి. కీలక నిర్ణయల్లో మార్పులుంటాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం. పారిశ్రామికవేత్తలు, కళాకారుకుల సమస్యలు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. లక్ష్మీ స్తుతి మంచిది.

కుంభరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. అనుకున్నది సాధించేవరకు విశ్రమించరు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు దక్కినా సంతృప్తినివ్వవు. మహిళలకు ఆస్తి లాభం. గణేశాష్టకం పఠించడం మంచిది.

మీనరాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వాహనాలు విషయంలో జాగ్రత్తలు అవసరం. కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులు, పారిశ్రామిక రంగాల వారికి నిరాశ. ఐటీ ఉద్యోగుల శ్రమకు ఫలితం దక్కదు. విద్యార్థుల శ్రమ వృథాగా మారుతుంది. మహిళలకు మానసిక అశాంతి. శ్రీ రామ స్తోత్రాలు పఠించడం మంచిది.


Full View

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

ఆడ‌దాని ఓర చూపుకు 'పడిపోయిన‌ జెన్స‌న్‌లు'!

2026-11-13 10:30 GMT

ఏడు పైసల లాభం.. రూపాయికి వచ్చింది ప్రాణం.. డాలర్ తో తగ్గేదేలే..

2026-11-13 10:26 GMT

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే, ఆ పని చేసి తీరుతా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

2026-11-13 10:10 GMT

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS