• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 25 మంగళవారం 2018...

డిసెంబరు 25 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-25 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి- గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. డబ్బు కోసం ఇబ్బందులు. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి నిరాశాజనకం. ఐటీ నిపుణులకు చికాకులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబ సభ్యులతో విరోధాలు. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: రాబడి అనుహ్యంగా పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. పనుల్లో అనుకూలత ఉంటుంది. కాంట్రాక్టర్లకు మరింత అనుకూలం. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు ఆస్తి లాభం. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి: బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం మరింత పెరుగుతుంది. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. గణేశాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులు అన్నింటా సహకరిస్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. ఐటీ నిపుణులకు ఉన్నతోద్యోగుల నుంచి పిలుపు వస్తుంది. విద్యార్థులకు అవకాశాలు మెరుగవుతాయి. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయటా సమస్యలు. సన్నిహితులతో వివాదాలు. గృహం - వాహనాలు కొనుగోళ్లలో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు స్థాన మార్పు ఉండవచ్చు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు ఆస్తి వివాదాలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కన్యారాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. రియల్టర్ల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ఆహ్వానాలు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు ఆస్తి లాభాలు. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. రియల్ ఎస్టేట్ వారికి నూతన అవకాశాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలకు మానసిక ప్రశాంతత. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. మిత్రులతో అకారణంగా తగాదాలు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకం. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. రాజకీయ - పారిశ్రామికవేత్తలకు పర్యటనల్లో అవాంతరాలు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. మహిళలకు సోదరులతో కలహాలు. కనకదుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: సన్నిహితులతో కలహాలు. కుటుంబ సభ్యులతో విబేధాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో లాభాలు ఆశించినంతగా ఉండవు. రాజకీయ - పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు అధికం. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభించదు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: అప్రయత్నంగా కార్యసిద్ధి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక - వస్తు లాభాలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగుల సేవకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ - కళాకారులకు సత్కారాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

కుంభరాశి: ఒక వార్త ఉత్సాహం ఇస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు దక్కుతాయి. పారిశ్రామిక - కళాకారులకు సత్కారాలు. ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు భూలాభాలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: ఆస్తి వ్యవహరాల్లో చికాకులు. మిత్రులు - బంధువులతో విరోధాలు. రాబడి తగ్గి రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగులు స్థానమార్పులు ఉండవచ్చు. రాజకీయ వేత్తలకు కొన్ని ఇబ్బందులు. ఐటీ నిపుణులకు విదేశీ అవకాశాలు చేజారతాయి. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. మహిళల అంచనాలు తప్పుతాయి. గణేశాష్టకం పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

ఆడ‌దాని ఓర చూపుకు 'పడిపోయిన‌ జెన్స‌న్‌లు'!

2026-11-13 10:30 GMT

ఏడు పైసల లాభం.. రూపాయికి వచ్చింది ప్రాణం.. డాలర్ తో తగ్గేదేలే..

2026-11-13 10:26 GMT

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

ప్రజలు అంగీకరించడానికి సమయం పట్టినా సరే, ఆ పని చేసి తీరుతా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

2026-11-13 10:10 GMT

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

మల్లారెడ్డి కోడలు.. మాట మార్చింది..

2026-11-13 07:17 GMT

'నమస్తే వరల్డ్'తో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతుల కొత్త ప్రయాణం!

2026-11-13 07:06 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!

2026-11-13 06:51 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం.. 70 ఏళ్ల తర్వాత సంచలనం!

2026-11-13 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS