క‌రోనా మృత‌దేహాన్ని న‌దిలో విసిరేస్తూ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు!

Update: 2021-05-31 01:30 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గంగా నదిలో శ‌వాల గుట్ట‌లు యావ‌త్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. కంగ‌నా ర‌నౌత్ వంటివాళ్లు అది ఇండియాలో కాద‌ని, నైజీరియాలో అని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత స‌ర‌యు న‌దిలోనూ శ‌వాలు బ‌య‌ట‌ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది.

అయితే.. తాజాగా ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు శ‌వాన్ని బ్రిడ్జి మీద నుంచి న‌దిలోకి విసిరేసిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనే చోటు చేసుకుంది. ఆ స‌న్నివేశం సీసీ కెమెరాలో స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో.. న‌దిలో శ‌వాలు తేలియాడిన సంఘ‌ట‌న‌లు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి.

ఈ నెల 28న బ‌ల‌రామ్ పూర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సీసీటీవీలో రికార్డ‌/ అయిన వీడియోలో ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ శ‌వాన్ని ఎత్తుకొని ఉన్నారు. అందులో ఒక‌రు పీపీఈ కిట్ ధ‌రించ‌గా.. ఒక‌రు మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి బ్రిడ్జి మీద నుంచి రాప్టి న‌దిలోకి శ‌వాన్ని విసిరేయ‌డం స్ప‌ష్టంగా రికార్డైంది.

స్పందించిన పోలీసులు.. వారిపై కేసు న‌మోదు చేసి, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ స్పందించారు. అది కొవిడ్ మృత‌దేహ‌మేన‌ని, కుటుంబ స‌భ్యులే న‌దిలో విసిరేశార‌ని చెప్పారు. ఈ నెల 28న ఆసుప‌త్రిలో చేరిన వ్య‌క్తి.. మూడు రోజుల త‌ర్వాత చ‌నిపోయిన‌ట్టు చెప్పారు. దీంతో.. కుటుంబ స‌భ్యుల‌కు మృత‌దేహాన్ని అప్ప‌గించామ‌ని తెలిపారు.


Tags:    

Similar News