ఆ మాస్క్ తో కరోనా అంతం అవుతుందట !
కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తిని చూస్తుంటే కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు దేశంలో కరోనా ను కంట్రోల్ చేయడం కష్టమే అని అనిపిస్తుంది. కరోనాకి సరైన వ్యాక్సిన్ వస్తే తప్ప ..కరోనా వైరస్ నుండి బయటపడలేము. అంతవరకూ పేస్ మాస్క్ ,భౌతిక దూరం, హ్యాండ్ వాష్ చేసుకుంటుండటం మర్చిపోకూడదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ ఓ చిన్న శుభవార్త చెప్పింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముంబై కి చెందిన స్టార్టప్ సంస్థ రూపొందించిన ఫేస్ మాస్క్ నోరు, ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా చూడటమే కాకుండా, కరోనా వైరస్ ను కూడా అంతం చేస్తుందట. ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ నానో టెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ కిల్లర్ మాస్క్ ను తయారుచేసింది. ఈ మాస్క్ కు ఉన్న మరో ప్రత్యేకత ..మాస్క్ వాష్ చేసుకుంటూ 60 నుంచి 150 సార్లు వరకూ ఉపయోగించుకోవచ్చని సదరు కంపెనీ తెలిపింది. థర్మ్‌సెన్స్ తయారుచేసిన ఈ మాస్క్ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడమే కాకుండా, మాస్క్ బయటి పొరకు వైరస్ అంటుకునేలా చేసి, దానిని అక్కడే అంతం చేస్తుంది.
ఈ పేస్ మాస్క్ భారతీయ ప్రయోగశాలలతో పాటు అమెరికన్ ల్యాబ్‌ల నుంచి కూడా ఆమోదం పొందింది. అలాగే ఈ మాస్క్ కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ సర్టిఫైడ్ చేసింది. ఈ మాస్కుల తయారీకి, వాడకానికి కూడా అనుమతి లభ్యమయ్యింది. దీనితో అతి త్వరలో మార్కెట్ లోకి అందుబాటులోకి రాబోయే ఈ మాస్క్ ధర రూ. 300 నుంచి 500 రూపాయల మధ్య ఉండవచ్చు.