మంత్రి పువ్వాడ కు కరోనా పాజిటివ్ !

Update: 2020-12-15 04:58 GMT
తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి భారిన పడే ప్రముఖుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తెలంగాణలో  ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ కు కరోనా పాజిటివ్‌ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సోమవారం నిర్వహించిన RTPCR పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలిందని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను హైదరాబాద్ ‌లో హోం ఐసోలేషన్‌ లోని ఉన్నాని చెప్పారు. ఎవరు ఆందోళన చెందాల్సి పనిలేదన్నారు. కరోనా నుంచి కోలుకుని మళ్లీ యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.

#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.
Tags:    

Similar News