దేవుళ్లను సైతం వదలని కరోనా
ఆ దేవుడిని సైతం కరోనా వదలని పరిస్థితి నెలకొంది. కరోనా తగ్గి దేవుడి దర్శనాలు మొదలైనా కానీ భక్తులకు దేవుడి కృప దక్కకుండా కరోనా అడ్డుపడుతోంది. గుడిలోకి వెళ్లగానే కోరిన కోర్కెలు తీరాలని మనం అర్చన చేస్తాం.. తీర్థం తీసుకుంటాం.. శఠగోపం పెట్టుకుంటాం.. ప్రసాదం తీసుకుంటాం. ఇప్పుడు కరోనా వల్ల ఇవన్నీ మనకు దూరం కానున్నాయి.
కరోనా కారణంగా చరిత్రలో ఎప్పుడూ మూతపడని తిరుమల సహా దేశంలోని ప్రముఖ దేవాలయాలన్నీ మూతపడ్డాయి. లాక్ డౌన్ ఎత్తివేసినా వీటిని తెరిచే సూచనలు కనిపించడం లేదు. 50 రోజులుగా భక్తులు లేకుండా అర్చకులు మాత్రమే ధూప దీప, నైవేద్యాలను అర్చకులు కొనసాగిస్తున్నారు. మే 17 తర్వాత గుడులు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే భక్తులంతా మాస్క్ లు, చేతులకు శానిటైజ్ తోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక స్వామి దర్శనం అనంతరం ఇచ్చే తీర్థం, ప్రసాదం, శఠగోపం లాంటివి అమలు చేయవద్దని.. వీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఆలయ బోర్డులు తర్జనభర్జన పడుతున్నాయి.
శఠగోపం ఒకరి తలపై పెట్టి మరొకరికి పెడితే కరోనా వ్యాపిస్తుంది. ఇక తీర్థం చేతిలో పోసినా అదే ఇబ్బంది.. ప్రసాదాలు చేతుల్లోనే పెట్టాలి. సో ఇక నుంచి వీటన్నింటిని బంద్ చేసి కేవలం దర్శనం మాత్రమే కల్పించడానికి ఆలయాలు రెడీ అవుతున్నాయట.. భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నా సరే కరోనా వ్యాపించకుండా ఇలా చేయకతప్పదని సూచిస్తున్నారు.