రెస్టారెంట్లు.. భోజనాలే కాదు కరోనాను వడ్డిస్తున్నాయి

Update: 2020-09-14 06:45 GMT
వారానికోసారి కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ల లో భోజనం చేయడం చాలామందికి అలవాటు. యువత నిత్యం రెస్టారెంట్ల లో ఎంజాయ్​ చేస్తుంటారు. ప్రేమపక్షులు కూడా రెస్టారెంట్లలో వివిధ రుచులను అస్వాదించడానికే ఇష్ట పడతారు. అయితే లాక్​డౌన్ ​తో రెస్టారెంట్లకు వెళ్లడం తగ్గి పోయింది. కానీ ప్రస్తుతం అన్నిదేశాలు వివిధ కారణాలతో లాక్​డౌన్​ నిబంధనలను సడలించడం తో మళ్లీ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. దీంతో భోజనప్రియులు రెస్టారెంట్ల బాట పట్టారు. అయితే రెస్టారెంట్లలో భోజనం చేయడం అంత సేఫ్​ కాదని తేల్చిచెబుతున్నది ఓ సర్వే.. రెస్టారెంట్ల కు వెళ్లని వాళ్లతో పోల్చుకుంటే.. రెస్టారెంట్లకు వెళ్లిన వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని చెప్పింది. ఆషామాషి సంస్థ కాదు.. అమెరికాకు చెందిన సెంటర్స్​ ఫర్​ డీసీసీ కంట్రోల్​ అండ్​ ప్రెవెన్సన్​(సీడీసీ). ఇటీవల సీడీసీ చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.  ఇంట్లో తినే వాళ్లకంటే.. రెస్టారెంట్​ కు వెళ్లి ఆరగించిన వారికి రెట్టింపుసంఖ్యలో కరోనా బారినపడ్డారని ఈ అధ్యయనంలో తేలింది. 18 ఏళ్లు నిండి.. కరోనా బారిన పడ్డ వారితో సీడీసీ సంస్థ మాట్లాడింది. వీరంతా తాము రెస్టారెంట్లకు వెళ్లినట్టు చెప్పారట. కరోనా రాని వాళ్లను  వేల మందిని సీడీసీ ఇంటర్వ్యూ చేసింది. అయితే ఆశ్చర్యం గా వీరంతా తామూ రెస్టారెంట్లకు వెళ్లలేదని చెప్పారట. ఈ లెక్కల ఆధారంగా సీడీసీ రెస్టారెంట్లకు వెళ్లిన వారికి కరోనా సోకే అవకాశం రెండితలు ఉన్నట్టు నిర్ధారించింది.

కారణాలు ఏమిటి..?
రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పడు తప్పనిసరిగా మాస్కు తీయాల్సి వస్తుంది. ఇతరులతో గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. వడ్డించేవాళ్లు, వండేవాళ్లు మాస్కులు పెట్టుకున్నప్పటికీ.. మన పక్క టేబుళ్లలో భోంచేసే వారు మాత్రం మాస్క్​ పెట్టుకోరు. వారికి ఒకవేళ కరోనా ఉంటే ప్రమాదమే. అంతేకాక హోటల్లో భౌతికదూరం పాటించడం సాధ్యమయ్యే పనికాదు.  గాల్లో వైరస్​ కొన్నిగంటలపాటు ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. కాబట్టి ప్రమాదం పొంచి ఉన్నట్టే. అందువల్ల రెస్టారెంట్లలో భోజనాలు సాధ్యమైనంతవరకు తగ్గిస్తే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
Tags:    

Similar News