రూపం మార్చుకుంటున్న కరోనా..మరి వ్యాక్సిన్లు పని చేస్తాయా..
చైనాలోని వుహన్ లో పుట్టినట్లు చెబుతున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో.. ఒక్కో విధంగా ప్రభావం చూపుతూ వస్తోంది. చైనాలో అమెరికా, ఇండియాతో పోలిస్తే తక్కువ కేసులు నమోదైనా మరణాల సంఖ్య మాత్రం ఎక్కువే. మన దేశం కరోనా కేసుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా, బ్రెజిల్ దేశాల్లో కూడా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే భారత్ లో పై మూడు దేశాల కంటే మరణాల సంఖ్య తక్కువగా నమోదైంది. నిజానికి ఇండియా వంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో కరోనా మరింతగా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కానీ అనుకున్న స్థాయిలో కేసులు నమోదు కాకపోవడం, మరణాల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా నమోదు కావడానికి కారణం కరోనా విభిన్న రూపాలే.
మన దేశంలో ప్రబలుతున్న వైరస్ కి మిగిలిన దేశాల్లో ప్రబలుతున్న వైరస్ కి తేడాలున్నాయి. దానికి తోడు వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోంది. వైరస్ కొత్తగా రూపాంతరం చెందినప్పుడల్లా అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆగ్నేయ ఇంగ్లాండ్ లో ఈ కొత్తరకం కరోనా వైరస్ జాడ కనిపించింది.
ఇప్పుడు తాజాగా తలెత్తుతున్న సందేహం ఏమిటంటే శాస్త్రవేత్తలు కరోనా నివారణకోసం సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్లు కొత్త వైరస్ అడ్డుకట్టకు ఎంతవరకు పని చేయగలవు ..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకుంటే ఒక నమూనా కరోనా వైరస్ ని చూసి దాని అంతానికి విరుగుడు మందు కనిపెడుతున్నారు. మరి కరోనా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుండటంతో అసలు సిద్ధం అవుతున్న టీకాలు ఆ రూపాంతరం చెందిన వైరస్ ని నాశనం చేయగలవా లేదా అనే అనుమానాలు తెలెత్తుతున్నాయి.
వైరస్ బారిన పడి కోలుకున్న వారి యాంటీ బాడీలు కుడా ఈ కొత్త రకం వైరస్ ని అంతం చేయడానికి పనికి రావు. కానీ ఆక్స్ ఫర్డ్ , ఫైజర్, మోడెర్నా, వంటి వ్యాక్సిన్లు కొత్త రకం వైరస్ ని ఎదుర్కొగలవు అని.. వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త రకం వైరస్ ని ఈ టీకాలు ఎదుర్కోలేకపోతే కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది. అప్పటి కాలంలో ఫ్లూ ప్రబలిన సమయంలో అది కూడా తన రూపాన్ని మార్చుకునేది. అయితే అందుకు తగ్గట్టే వ్యాక్సిన్లు కూడా ఎప్పటికప్పుడు మార్చి ఇచ్చేవారు. ఇప్పుడు కరోనాకు కూడా వైరస్ రూపాంతరాన్ని బట్టి వ్యాక్సిన్లను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.