పాకిస్తాన్ లో హిందూ దేవాలయ నిర్మాణం ...
భారత ప్రజలకు ఇది అతి పెద్ద శుభవార్త అవుతుంది అని చెప్పాలి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో హిందూ దేవాలయం ఏర్పాటు రంగం సిద్దమైంది. భారీ ఖర్చుతో మువ్వ గోపాలుడు శ్రీకృష్ణుడి ఆలయ ఏర్పాటుకు అక్కడి ప్రజలు ముందడుగు వేశారు. 1947కు పూర్వం పాకిస్తాన్ లో ఎన్నో హిందూ దేవాలయాలకు, చరిత్రకెక్కిన ఆలయాలు ఉన్నాయి. కానీ, భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తరువాత హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వాటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు అక్కడడక్కడ మాత్రమే హిందూ దేవాలయాలకు కనిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆలయాలను శిధిలావస్థలో ఉన్నాయి.
ఇక తాజాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో రూ.10 కోట్ల రూపాయలతో శ్రీకృష్ణ దేవాలయం నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన స్థలాన్ని, ఆలయ నిర్మాణం కోసం కావలసిన నిధులను పాక్ ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది. ఇస్లామాబాద్ లో 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఇస్లామాబాద్ లో హిందూ జనాభా పెరుగుతున్నది. ఈ క్రమంలో ఆలయాలకు వెళ్లేందుకు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోంది.
దీనితో ఇస్లామాబాద్ లోనే ఈ ఆలయం నిర్మించబోతున్నట్టు మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చాంద్ తెలిపారు. ఈ ఆలయానికి దగ్గర్లోనే హిందువుల కోసం స్పెషల్ శ్మశాన వాటికను నిర్మించనున్నారు. హ్యూమన్ రైట్స్ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ఈ ఆలయ పనులను స్టార్ట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు వెల్లడించారు. ఈ దేవస్థానానికి ఇస్లామాబాద్ లోని హిందూ పంచాయతీ శ్రీకృష్ణ మందిర్ అని పేరు పెట్టింది.