• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ లో రేవంత్...

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏకాకి..

By - Tupaki Desk
Update: 2019-09-22 04:29 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశాడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. పీసీసీ పీఠమిస్తే అధికారంలోకి తెస్తానని మాట ఇచ్చినట్టున్నాడు..  తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని ఉబలాటపడ్డ రేవంత్ రెడ్డికి ఇప్పుడు సొంత కాంగ్రెస్ వర్గమే అసమ్మతై ఆయన ముందరి కాళ్లకు బంధం వేస్తోందట. పీసీసీ పీఠం కాదు కదా.. కనీసం ఒక సీటు విషయంలో కూడా రేవంత్ మాట తాజాగా చెల్లుబాటు కాకపోవడం కాంగ్రెస్ లో ఆధిపత్య రాజకీయాలకు అద్దం పడుతోందంటున్నారు..

తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నిలబడే అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి తనే ఒక కొత్త అభ్యర్థిని రేవంత్ ప్రకటించారు. అయితే ఉత్తమ్ ఏకపక్షంగా చర్చించకుండా ప్రకటించాడని.. ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ చేసిన ప్రకటన కాంగ్రెస్ లో కలకలం రేపింది.

ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆయన ఉద్దేశం తెలిసిన కాంగ్రెస్ సీనియర్లు అంతా ఏకమయ్యారు. జానారెడ్డి - కోమటిరెడ్డి - వీహెచ్ లు రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంతా ఉత్తమ్ కే సపోర్ట్ చేశారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి - శ్రీధర్ బాబు కూడా ఈ విషయంలో రేవంత్ కు సపోర్ట్ చేయకుండా ఉత్తమ్ కు అండగా నిలబడకుండా మౌనం పాటించారు.

ఉత్తమ్ కు చెక్ చెప్పాలని.. పంతం నెగ్గించుకోవాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాయకత్వ లోపంతో కునరిల్లుతున్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి సీఎం పీఠం లక్ష్యంగా ముందుకెళ్లాలనుకుంటున్న రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఒంటరిగా మారిపోయారు. భవిష్యత్ నేతగా వచ్చి ఇప్పుడు సీనియర్ల దెబ్బకు భవిష్యత్ లేకుండా అయిపోతున్నారు. రేవంత్ ను కాంగ్రెస్ లో వ్యూహాత్మకంగా ఏకాకిని చేసిన తీరు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
Tags:    
  • Congress Party Senior Leaders 
  • Uttamkumar Reddy 
  • Revanth Reddy 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS