జాతీయ పార్టీలకు 'సౌత్'లో శూన్యమే..!
జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్ కు దక్షిణాదిలో ప్రతికూల గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కేంద్రంలో సైతం కీలకంగా ఉండేది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో బీజేపీకి ఎంతో కొంత బలం ఉండేది. కానీ ప్రస్తుతం సౌత్ స్టేట్స్ లో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ ఎస్ అధికారం చేపట్టగా.. త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ లేదా వైసీపీలు మాత్రమే అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా - తమిళనాడులో డీఎంకే - అన్నాడీఎంకేల మధ్యే పోరు సాగుతోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేలా తీవ్రంగా కృషి చేశాడు. ఆయన చేసిన పాదయాత్రతో 2004లో రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను నిలబెట్టడంలో కీలకంగా మారారు. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్ ఆర్ దే ప్రముఖ పాత్ర వహించింది. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. అటు తెలంగాణలోనూ.. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రాంతీయ పార్టీలైన టీఆర్ ఎస్ - టీడీపీలు అధికారాన్ని చేపట్టాయి.
2014 ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ తామే ఇచ్చామని ఎన్నికల్లో చెప్పినా తెలంగాణలో కాంగ్రెస్ ను జనాలు ఎవరూ నమ్మలేదు. దీంతో ఆ పార్టీ కొన్నిచోట్ల మాత్రమే గెలుపొంది అధికారాన్ని చేపట్టలేకపోయింది. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది. ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో తమకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆ పార్టీని ఎవరూ ఆదరించలేదు. ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఎదరవనుంది. దీంతో ఏపీలోనూ కాంగ్రెస్‌కు గడ్డుకాలమే కనిపిస్తోంది.
ఏపీ - తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ స్నేహంగా ఉన్నా ఆ పార్టీ అధికారంలో లేనందున వచ్చే ఎన్నికల్లో ప్రభావం లేకపోవచ్చనే తెలుస్తోంది. ఇక కేరళలో వామపక్షాలదే హవా నడుస్తోంది. కర్ణాటకలో మాత్రం జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అది ఎప్పటివరకోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇలా కాంగ్రెస్ కు సౌత్ మొత్తం ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవన్న చర్చ జోరుగా సాగుతోంది.
మరో జాతీయ పార్టీ బీజేపీకి గత ఎన్నికల్లో ఏపీ - తెలంగాణలో కొన్ని సీట్లతో కాస్త పర్వాలేదనిపించింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నిల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచి పరువు పూర్తిగా తీసుకుంది. త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మోదీ లాంటి పెద్ద నేతలు రాష్ట్రంలో అడుగుపెట్టినా కమలం పార్టీకి కలిసివచ్చే అవకాశాలు కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు.
తమిళనాడులో అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లయినా రాబట్టాలని ఆలోచిస్తోంది బీజేపీ. అయితే రాష్ట్రం మొత్తం ఏదో ఒక ప్రాంతీయ పార్టీనే నమ్మతారు గానీ జాతీయ పార్టీ గురించి అక్కడి ప్రజలు పట్టించుకోరు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరి వరకు వచ్చినా అధికారం చేపట్టలేకపోయింది బీజేపీ. ఇలా బీజేపీకి కూడా దక్షిణాన మంచిరోజుల కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది.