సిద్దాంతాలు మారాయా? కామ్రెడ్‌ మారారా?

Update: 2020-11-02 02:30 GMT
రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల వైఖ‌రి, ముఖ్యంగా సీపీఎం నేత పినుమ‌ల్లి మ‌ధు వైఖ‌రి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అటు రాజ‌కీ యంగా.. ఇటు సైద్ధాంతికంగా కూడా క‌మ్యూనిస్టులు వేస్తున్న‌ఫీట్లు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాలే ఊపిరులుగా. ప్ర‌ధాన సిద్ధాంతాలుగా మ‌న‌గ‌లుగుతున్న క‌మ్యూని స్టులు.. ఇప్పుడు వీటిలోనూ త‌మ‌కు అనుకూల విధానాల‌ను, నినాదాల‌నే ఎంచుకోవ‌డం.. అధికార పార్టీ వైపు.. ఓర‌కంట క‌నుగీటుతుండ‌డం వంటివి.. క‌మ్యూనిస్టు సిద్ధాంతాలు మారాయా?  లేక కామ్రెడ్స్ మారారా? అనే ప్ర‌శ్న‌ల‌ను తెర‌మీదికి తెస్తున్నాయి.

సీపీఐ ఒక‌ర‌కంగా ఫ‌ర్వాలేద‌ని అనిపించేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. సీపీఐ నారాయ‌ణ కానీ, రాష్ట్ర పార్టీ కార్య‌ద‌ర్శి కే.రామ‌కృష్ణ కానీ.. ప్ర‌భుత్వంపై కొన్ని కొన్ని విష‌యాల్లో అయినా.. ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌భుత్వం వ్య‌తిరేక విధానాల‌ను తీసుకువెళ్తున్నారు. మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆది నుంచి ఒకే స్టాండ్‌తో పోరాడుతున్నారు.  మంత్రుల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. ఇటీవ‌ల రాజ‌ధాని రైతుల‌కు బేడీలు వేయ‌డం వంటి విష‌యాల‌ను సీపీఐ బాగానే ప్రొజెక్ట్ చేస్తూ.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించింది.

అదేస‌మ‌యంలో వామ‌ప‌క్షం.. సీపీఎం మాత్రం మౌనం వ‌హిస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పెనుమ‌ల్లి మ‌ధు.. సీఎం జ‌గ‌న్ విష‌యంలోను, ప్ర‌భుత్వం విష‌యంలోనూ మౌనంగా ఉంటున్నారు. వాస్త‌వానికి సీపీఐ క‌న్నా.. సీపీఎం సిద్ధాంతాలు ఇంకా బ‌లంగా ఉంటాయ‌ని అంటారు. కానీ.. రాజ‌ధాని రైతుల‌కు బేడీలు వేసినా.. పోల‌వ‌రం విష‌యంలో త‌డ‌బ‌డుతున్నా.. మ‌ధు నోరు మెద‌ప‌లేదు. అంతెందుకు.. ఎప్పుడు రౌండ్ టేబుల్ స‌మావేశాలు జ‌రిగినా.. సీపీఎం నేత‌లు ముందుంటారు. కానీ, తాజాగా పోల‌వ‌రం విష‌యంలో జ‌రిగిన రౌండ్ టేబుల్‌కు హాజ‌రుకాలేదు. ప్ర‌భుత్వ వైఖ‌రిని నిల‌దీయ‌నూ లేదు.

దీంతో తెర‌వెనుక సీపీఎంకు.. వైసీపీకి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో అంటే.. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణం చేసిన కొత్త‌లో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ధును స్వ‌యంగా ఇంటికి వెళ్లి ప‌ల‌క‌రించి వ‌చ్చారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కొంద‌రు క‌మ్యూనిస్టుల‌కు కూడా మ‌ధు అనారోగ్యంతో ఉన్నార‌నే విష‌యం కూడా తెలియ‌దు. అంటే.. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య అంత రెపో ఉంద‌న్నమాట‌. సొంత సామాజిక వ‌ర్గ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఎర్ర‌జెండా క‌ప్పుకొన్నాక మ‌ధు  మారార‌ని అంటారు. కానీ, ఇప్పుడు అదే ఆయ‌న‌కు అడ్డు త‌గులుతోందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇలా అయితే.. సీపీఎం ముందుకు వెళ్లిన‌ట్టే!! అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News