'క్వీన్ ఆఫ్ డెర్బీ'ని, అదర్ పునావాలాను కలిపింది.. లిక్కర్ కింగ్ మాల్యానే..!

Update: 2021-05-03 09:30 GMT
కరోనా కాలం మొదలైన అనతి కాలంలోనే దాని విరుగుడుకు వ్యాక్సిన్ తయారీలో తలము నకలైన సంస్థల్లో సీరం ఇనిస్టిట్యూట్ ఒకటి. ఆ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ కోవీషీల్డ్ ప్రస్తుతం ఇండియాతో పాటు మరెన్నో దేశాల్లో కరోనా  నియంత్రణకు మందుగా వాడుతున్నారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పుడు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోని ఆస్పత్రులలో ఇస్తున్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను తమ దేశాలకు దిగుమతి చేసుకుంటున్నాయి.

కోవీషీల్డ్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో  అప్పటి నుంచి సీరం ఇనిస్టిట్యూట్ సంస్థల అధినేత అదర్ పునావాలా పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. కోవీషీల్డ్ మార్కెట్లోకి వచ్చాక అతడి ఆస్తి పాస్తులు  కూడా భారీగా పెరిగిపోయాయి. ఇటీవల లండన్లోని ఓ విల్లాను  అద్దెకు తీసుకున్న పునావాలా దానికి నెలకు రెంట్ రూ.50 లక్షలు పే చేస్తున్నాడంటే అతడెంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడో  అర్థమవుతుంది.

పునావాలానే  కాదు ఆయన భార్య నటాషా కూడా పెద్ద బిజినెస్ ఉమెన్. కోవిషీల్డ్ మార్కెట్ లోకి వచ్చాకా అదర్ పునావాలా, నటాషాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియాలో వారి వివరాల కోసం సెర్చ్  చేస్తున్నారు. అదర్ పునావాలా లాగే నటాషా కూడా వివాహానికి  ముందే పెద్ద  బిజినెస్ ఉమెన్ గా పేరు గడించింది.

అదర్ పునావాలా, నటాషా జంట అయ్యింది మాత్రం కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వల్లే. ఓసారి గోవాలో విజయ్ మాల్యా పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీకి అదర్ పునావాలా,  నటాషా కూడా హాజరయ్యారు. ఆ పార్టీలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకుని దంపతులుగా మారారు. పునావాలాలాగే నటాషా కూడా కాస్ట్లీ ఉమెన్.

ఆమెకు బాలీవుడ్ కు  చెందిన నటీనటులతో పరిచయాలు ఉన్నాయి. నటాషా నిర్వహించే పార్టీలకు ఐశ్వర్యరాయ్, కరీనాకపూర్ వంటి అగ్ర హీరోయిన్లు కూడా వస్తుంటారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లను వినియోగిస్తుంటారు. బ్రాండెడ్ దుస్తులు మాత్రమే ధరిస్తుంటారు. నటాషా ను అందుకే సోషల్ సర్కిళ్లలో 'క్వీన్ ఆఫ్ డెర్బీ'గా పిలుస్తుంటారు.

నటాషా సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటారు. తన అత్తగారు మెలిందా గేట్స్ మరణించిన తర్వాత ఆమె పేరిట ఒక ఫౌండేషన్ స్థాపించి సమాజసేవ చేయడం ప్రారంభించారు. చెత్తను రీసైకిల్ ఎనర్జీ గా మార్చడం, పేద ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం, పూణే సిటీని మోడల్ సిటీ గా మార్చడం కోసం నటాషా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పూణేలో ఒక స్వచ్ఛంద ఆస్పత్రిని  కూడా ప్రారంభించి సేవలందిస్తున్నారు. సేవా సంస్థల అన్నింటికీ నటాషా అనే చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.
4

ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్గనైజేషన్ బిహేవియర్ నుంచి 2004లో నటాషా డిగ్రీ పూర్తిచేసింది. నటాషా పూనావాల ఇండస్ట్రీస్ లో కొన్ని కీలక పదవుల్లో వున్నారు. విలూ పునావాలా ఫౌండేషన్  చైర్ పర్సన్ గా  కూడా ఉన్నారు. అలాగే సీరం  ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా  వ్యవహరిస్తున్నారు.  నెదర్లాండ్ లో ఉన్న వ్యాపార సంస్థలకు డైరెక్టర్ గా  కూడా నటాషా ఉన్నారు.
Tags:    

Similar News