దమ్ముంటే మా ప్రభుత్వాన్ని పడగొట్టండి...సీఎం ఉద్దవ్ థాక్రే సవాల్!
మహారాష్ట్రలో ఎన్నికలు , ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయినా కూడా ఇంకా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం , విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలకి దిగుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ , సీఎం ఉద్దవ్ కి ఓ లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుత వివాదానికి కేంద్ర బిందువుగా మారుతుంది. మూసివేసిన ఆలయాలను, ప్రార్ధనా మందిరాలను తెరవాలని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
తాజాగా ముంబయి లోని నిర్వహించిన దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. శివసేన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది అయిందని, నేను సీఎం అయిన మొదటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కొందరు అంటూనే ఉన్నారని, 'నేను వారికీ సవాల్ విసురుతున్న... మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే హిందూత్వ గురించి ఎవరూ తమకు చెప్పనక్కర్లేదని గవర్నర్ కి చురకలంటించారు. హిందుత్వం గురించి చెప్పే వాళ్లు రాష్ట్రంలో ఆలయాలు ఎందుకు తెరవడం లేదని కొందరు తమను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.. బాలా సాహెబ్ హిందుత్వానికి, ఉద్ధవ్ థాక్రే హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని వారు అంటున్నారు.. వాళ్ల హిందుత్వం కేవలం అరుపులకే పరిమితం, తమ హిందుత్వం అలాంటిది కాదు పరోక్షంగా గవర్నర్ వ్యాఖ్యలకి రిప్లై ఇచ్చారు.
మీరు హిందూత్వ గురించి మాట్లాడుతున్నారు.. కాబట్టి బీఫ్ పై మహారాష్ట్ర లో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.. కానీ గోవాలో ఎందుకు అనుమతించారు.. ఇదేనా మీ హిందుత్వం అని ప్రశ్నించారు. మీరు బలమైన హిందూత్వ వాది. సీఎం గా ప్రమాణం చేసిన వెంటనే అయోధ్యను కూడా సందర్శించారు. లౌకిక వాదాన్ని ద్వేషించే మీరు హఠాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని ఉద్ధవ్‌కు రాసిన లేఖ లో గవర్నర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బార్లు, రెస్టారెంట్లు, బీచ్ లు తెరిచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. దేవుళ్లు, దేవతలను మాత్రం లాక్‌డౌన్‌లోనే ఉంచుతుందా అని నిలదీశారు. దీనికి సీఎం కొంచెం ఘాటుగా బదులిస్తూ ప్రార్థనా మందిరాలు తెరిస్తే హిందూత్వ వాదిని, లేకపోతే లౌకికవాదినా అని నిలదీశారు. లౌకిక వాదం అనేది రాజ్యాంగంలో కీలక అంశం కాదా గవర్నర్ గా మీకు ఆ సంగతి తెలియదా నా హిందూత్వం గురించి మీ సర్టిఫికెట్ అవసరం లేదు అని ఠాక్రే తెలిపారు.