ప్రధాని నరేంద్రమోడీ అంటే సర్రుమని లేచే సీఎంలలో మమతా బెనర్జీ ఒకరు.ఈ ఫైర్ బ్రాండ్ నేతను ఓడించడానికి బెంగాల్ లో బీజేపీ చేయని ప్రయత్నం లేదు. బెంగాల్ లో గవర్నర్ తో మమతా బెనర్జీ సర్కార్ ను బీజేపీ ఓ ఆట ఆడిస్తుందన్న ప్రచారం ఉంది. ఇక ఉన్నతాధికారులను కేంద్రం నుంచి ఆదేశిస్తూ మమతను ఇబ్బందులు పెడుతోంది.
ఇంతటి ఉప్పునిప్పులు ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటారు. అయితే తాజాగా మమతా బెనర్జీ.. తన ప్రత్యర్థి మోడీ విషయంలో ఒక సానుకూల వైఖరిని తీసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకంగా పండిన ప్రముఖ బెంగాలీ మామిడి పండ్లను సీఎం మమతా బెనర్జీ తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి, కాంగ్రెస్ నేత సోనియాగాంధీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, మరో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పంపించారట..
ఢిల్లీలో ఉండే ప్రముఖ నేతలకు మమత ఏరికోరి మామిడి పండ్లను పంచిన వైనం వార్తల్లో నిలిచింది. ప్రత్యేకించి మోడీ, అమిత్ షా బెంగాల్ లో మమత ను ఓడించడానికి ఎంతో చేసినా వారిపై కోపం ఉన్నా కూడా మమత ఈ చర్యతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.
రాజకీయాలు ఎన్ని ఉన్నా సరే.. ఓ మంచి విషయంలో మమతా బెనర్జీ తీసుకున్న ఈస్టెప్ నిజంగా అందరి మనసు చూరగొంది. మామిడి పండ్ల దౌత్యంతోనైనా సరే వారి తీరు మారుతుందో లేదో చూడాలి.