కాన్వాయ్ అపి కోతులకు అరటి పండ్లు పంచిన సీఎం కేసీఆర్

Update: 2020-09-14 08:50 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.  సీఎం కేసీఆర్ యాద్రాద్రి లో కోతుల కు అరటి పండ్లను అందించారు. యాదాద్రి పర్యటనలో భాగంగా .. అక్కడి  పనులను సమీక్షించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ , నరసింహ స్వామి దర్శనం చేసుకొని , అక్కడి పనులని పర్యవేక్షించి , కాంట్రాక్టర్లతో మాట్లాడి  తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే , కారులో వెళ్తున్న సమయం లో కోతులను చూసి కారు ఆపారు. గుంపులు గుంపులుగా కోతులు ఉండటం చూసిన సీఎం కేసీఆర్ తన సెక్యూరిటీ కి చెప్ప కాన్వాయ్‌ ను అపి , కారులో నుంచి దిగి స్వయంగా కోరులకి అరటిపండ్లు అందించారు.  

గుంపులు గుంపులుగా వచ్చిన కోతులకు తన భద్రతా సిబ్బందితో కలిసి అరటి పండ్లను అందజేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా ...  ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అంతకు ముందు ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌కు అశ్వీరచనాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొండ కింద నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు, ప్రెసిడెంట్ సూట్ సహా పలు నిర్మాణలకు సంబంధించిన పురోగతిని సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు.
Tags:    

Similar News