సీఎం కేసీఆర్ ఆగిన ఊరు సుడి తిరిగిపోయిందిగా?
నాటకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సామాన్యుల్ని కలవరు.. మంత్రులకే టైం ఇవ్వరన్న పేరున్న కేసీఆర్.. తన తీరుకు భిన్నంగా.. తనపై జరిగే ప్రచారానికి విరుద్ధంగా వ్యవహరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారాయన. తన కలల పుత్రిక అయిన రైతు వేదికల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జనగామ జిల్లా కొడకండ్ల గ్రామానికి వెళ్లి.. అక్కడి రైతువేదికను ప్రారంభించటం తెలిసిందే.
తన తిరుగు ప్రయాణంలో యాదాద్రి భువనగిరి జిల్లా తర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ కాసేపు ఆగటం.. అక్కడి వారిని తన స్పీచ్ విన్నారా? అని అడగటమే కాదు.. ఇతర అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తమకు రోడ్లు సరిగా లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తన ఫాంహౌస్ కు రావాలని గ్రామస్తుల్ని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
ముఖ్యమంత్రే స్వయంగా ఫాంహౌస్ కు రావాలని చెప్పటంతో వెళ్లిన వారికి ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం కేసీఆర్ ఆ గ్రామానికి చెందిన ప్రతినిధులతో ఏకంగా రెండు గంటల పాటు గడపటమే కాదు.. వివిధ అంశాల్ని చర్చించారు. అంతేకాదు.. సదరు గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని చెప్పటమే కాదు.. గ్రామాన్ని డెవలప్ చేసేందుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల నిధులు ఇస్తానని చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
మాటలతో సరిపెట్టకుండా.. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి.. ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రామంలో చేపట్టాల్సిన డెవలప్ మెంట్ యాక్టివిటీస్ గురించి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు ఫోన్ లో వివరించారు. దీంతో ఆమె హడావుడిగా ఆ గ్రామాన్ని సందర్శించారు. అంతేకాదు.. పది నుంచి పదిహేను రోజుల్లో తాను ఆ గ్రామానికి వస్తానని.. గ్రామసభ పెట్టి స్థానిక అవసరాలు తీరుస్తానని మాట ఇచ్చారు. ఇలా ఊహించని లక్ తో ఆ గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రైతు వేదికను ప్రారంభించేందుకు వెళ్లిన కొడకండ్లకు ఎలాంటి హామీ లభించకుంటే.. ఆ ఊరి నుంచి ఫాంహౌస్ కు తిరిగి వెళ్లే క్రమంలో ఆగిన గ్రామం సుడి తిరిగిపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. కేసీఆరా.. మజాకానా?