రేవ్ పార్టీతో ర‌చ్చ ర‌చ్చ‌.. పోలీసులు రంగంలోకి దిగేస‌రికి

Update: 2021-06-14 00:30 GMT
ఓ ప‌క్క క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. రాష్ట్రానికి.. ప్ర‌జ‌ల‌కు ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వుతున్నా.. లాక్ డౌన్ వంటి క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తూ మ‌హ‌మ్మారిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. కానీ.. కొంద‌రికి మాత్రం ఇవేవీ ప‌ట్ట‌ట్లేదు. ఏకంగా పార్టీలు ఏర్పాటు చేసుకొని క‌లిసి తాగుతూ తైత‌క్క‌లాడుతున్నారు. అలాంటి వారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకొని మూసేశారు పోలీసులు.

రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని ఓ ఫామ్ హౌస్ లో శ‌నివారం బ‌ర్త్ డే పార్టీ పేరుతో ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు దాదాపు 70 మందికిపైగా యువ‌తీయువ‌కులు అక్క‌డికి చేరుకొన్నారు. అయితే.. అది బ‌ర్త్ డే పార్టీ కాదు.. రేవ్ పార్టీ. అక్క‌డికి వ‌చ్చిన వారంతా.. మందు తాగుతూ.. మ‌త్తు ప‌దార్థాలు తీసుకుంటూ ర‌చ్చ రంబోలా చేశారు.

ఈ విష‌యమై పోలీసుల‌కు స‌మాచారం అందింది. వారు వెంట‌నే రంగంలోకి దిగారు. అక్క‌డి వెళ్లి చూసిన పోలీసుల‌కు దిమ్మ తిరిగిపోయింది. మ‌ద్యం మ‌త్తులో దాదాపు 70 మంది సోయిలో లేకుండా చిందులేస్తున్నారు. వెంట‌నే యాక్ష‌న్లోకి దిగిన పోలీసులు.. అంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. క‌రోనా విజృంభిస్తున్న ఈ త‌రుణంలో ఇలాంటి పార్టీలు నిర్వ‌హించ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.




Tags:    

Similar News