బుద్ది మార్చుకోని చైనా ..లడక్ గగనతలంలో హెలికాఫ్టర్స్ కవ్వింపు!

Update: 2020-05-12 12:11 GMT
ఇటీవలే ఉత్తర సిక్కింలో చైనా, భారత దళాల మధ్య జరిగిన ఘర్షణ, రాళ్ళ దాడుల ఘటన మరువక ముందే, మరోసారి మన దేశాన్ని కవ్వించిన ఘటన ఆందోళనకు దారి తీస్తోంది. లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా ఉద్రిక్త పరిస్థితులను సృష్టించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రదేశంలో ఈ రేఖకు అతి దగ్గరగా చైనా సైనిక హెలికాఫ్టర్లు ఎగరడాన్ని భారత దళాలు గమనించాయి. నార్త్ సిక్కింలో ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణ సమయంలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం.

చైనా చాపర్లను చూసిన భారత వైమానిక దళ జెట్ ఫైటర్లు అక్కడికి చేరుకున్నాయని, సమయం లభిస్తే ఏదో ఒక చర్యకు దిగేందుకు సమాయత్తమయ్యాయని తెలిసింది. అయితే చైనా చాపర్లు భారత భూభాగంలోకి ప్రవేశించలేదు. ఇతర విమానాలతో బాటు లడఖ్ లోని లేహ్ ఎయిర్ బేస్ నుంచి తరచూ సుఖోయ్ యుధ్ధ విమానాలు ఎగురుతుంటాయి.

ఇండియాతో గల తూర్పు సరిహద్దుల్లో ముఖ్యంగా రాత్రివేళల్లో పాకిస్తాన్ తన యుధ్ధ విమానాలను పంపుతుంటుందని, గగనతలంలో ఎగిరే వీటిని భారత జవాన్లు గమనించారని సైనిక వర్గాలు తెలిపాయి. చూడబోతే పాక్, చైనా వేర్వేరుగానో, కలిసికట్టుగానో భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో చైనా మిలిటరీ హెలికాఫ్టర్లు చాలాసార్లు లడఖ్ సెక్టార్ లో ప్రవేశించి వెనుదిరిగాయి.
Tags:    

Similar News