చైనా కుయుక్తులు.. నేపాల్ ను నమ్మించి గొంతుకోసింది

Update: 2020-09-28 10:30 GMT
గత కొంతకాలంగా భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల చైనా.. నేపాల్​ను కూడా భారత్​ మీదకు ఉసిగొల్పింది. దీంతో ఎన్నో ఏళ్లుగా భారత్​తో సత్సంబంధాలు కొనసాగించిన నేపాల్​ కూడా భారత్​తో కయ్యానికి దిగింది. చైనా ప్రోద్బలంతోనే నేపాల్​ లాంటి చిన్న దేశం భారత్​తో గొడవలు పెట్టుకున్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో  చైనా చేసిన ఓ పనికి నేపాల్​ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది.నేపాల్​ చెందిన కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించి వేసింది. చైనా మాట విని భారత్​ తో కయ్యం పెట్టుకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని నేపాల్ లోని ఓ వర్గం పేర్కొంటున్నది.  నిజానికి చైనా నిరంతరం విస్తరణ కాంక్ష తో చెలరేగి పోతుంటుంది. ఇతర దేశాల భూభాగాలను అక్రమంగా సొంతం చేసుకొనేందుకు ఎప్పుడూ ముందు ఉంటుంది.

అందుకే ప్రపంచం లోని చాలా దేశాలతో చైనా శత్రుత్వం పెట్టుకున్నది. దశాబ్దాల క్రితమే  భారత్ భూభాగాన్ని ఆక్రమించుకున్నది.  పాకిస్తాన్ లోనూ జెండాలు పాతింది. వ్యాపారం పేరుతో శ్రీలంకలో కూడా భూములను తీసుకుంది. ఇటీవల నేపాల్​ భూభాగం మీద చైనా కన్ను పడింది.  టిబెట్​ సరిహద్దు లో నేపాల్​ కు కొంత భూభాగం ఉన్నది. ఆ భూభాగాలను ఇటీవల ఆక్రమించుకున్న చైనా అక్కడ 11 అతిపెద్ద భవనాలను నిర్మించింది. మరోవైపు హూమ్లా జిల్లా లోని లాంప్సా గ్రామం లో కొంత భాగాన్ని ఆక్రమించేసింది.  ఇతర దేశాలతో సరిహద్దులను మార్చడం.. ఆ తర్వాత అక్కడ భూభాగంలో జెండాలు పాతడం చైనా విధానం. కాగా చైనా వైఖరిపై నేపాల్​ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఆ దేశంలోని విపక్షాలు, ప్రజాసంఘాలు చైనా తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టాయి. అయితే ఈ విషయంపై నేపాల్​ పార్లమెంట్ లో మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్చలు జరుగలేదు. నేపాల్​ ప్రభుత్వం చైనా చర్యలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News