అమ్మాయి ప్రేమ పేరుతో మోసం.. వంశీ కృష్ణ సూసైడ్ కు కారణం అదే

Update: 2020-12-15 08:12 GMT
హైదరాబాద్ లోని అల్వాల్ లో ఇటీవల వంశీకృష్ణ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రియురాలితో గొడవ కారణంగానే మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.

దీనిపై తాజాగా వంశీ కృష్ణ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు.  ప్రేమ వ్యవహారంతోనే మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. ప్రేమించి వెంట తిరిగి ఆ తర్వాత అమ్మాయి ఇలా మోసం చేసిందని వారు తెలిపారు.

తాము అమ్మాయితో పెళ్లికి కూడా ఒప్పుకున్నామని.. వాళ్ల అక్క మాట్లాడితే ఆమెకు చెప్పామని.. తీరా ఇప్పుడు తిరస్కరించడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై వంశీ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఆదివారం రాత్రి పార్టీలో ఉన్నానని వంశీ తెలిపాడని.. సోమవారం పది గంటల సమయంలో వంశీకృష్ణ పట్టాల పై  పడి ఉన్నాడని తల్లిదండ్రులు బోరున విలపించారు.. మా ఒక్కాగానొక్క కొడుకు, ఇలా చేసుకుంటాడని అనుకోలేదని వాపోయారు. నాకొడుకుకు జరిగిన అన్యాయం మరో ఇంట్లో జరగకుండా చూడాలి అని వంశీకృష్ణ తల్లిదండ్రులు  మొరపెట్టుకున్నారు.
Tags:    

Similar News