మోడీ పై బాబు అటాక్.. ఈయనే కీరోల్..
ఉమ్మడి ఏపీ కలిసున్న రోజులు.. పెద్ద రాష్ట్రం.. దాని మీద ఆధారపడ్డ పెద్ద మీడియా సంస్థలు.. ఎక్కువశాతం మీడియా ఒకే సామాజికవర్గం చేతిలో ఉండేది.. అందుకే వార్తలన్నీ ఒకేరకంగా వచ్చేవి. వేరే పార్టీలను - ఎదురుతిరిగిన వాళ్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారు.. తెలుగు రాష్ట్రాల్లో మీడియాను అంటిపెట్టుకొని బాగా మేనేజ్ చేసిన నాయకుడిగా చంద్రబాబు పేరు ముందుంటుందని రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. తెలుగు మీడియాలో అగ్రస్థానాల్లో ఉన్న టాప్ 2 పత్రికలు కూడా ఆయన వెంటే ఉండేవి.. బాబు మీడియా మేనేజ్ మెంట్ కు భయపడే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ తనకు మద్దతుగా.. ప్రజాసమస్యలను నిష్పక్షపాతంగా చూపించేందుకు.. ఒకవైపే చూపిస్తున్న మీడియాలో మరోకోణాన్ని ఆవిష్కరించేందుకు సొంతంగా మీడియా సంస్థలను నెలకొల్పారు.. ఇక మీడియా వల్ల ఉమ్మడి ఏపీలో ఎక్కువగా బలి అయ్యింది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆరే..
చంద్రబాబు అనుకూల మీడియా కేసీఆర్ పై కథనాలతో ముప్పుతిప్పలు పెట్టి ఆయన రాజకీయాల్లో ఎందుకు వచ్చునురా నాయనా అనేలా విసిగించింది. అందుకే గద్దెనెక్కగానే సీఎం కేసీఆర్ చేసిన మొదటి పని మీడియాను మేనేజ్ చేయడం.. దాన్ని సక్సెస్ ఫుల్ గా చేసి ఇప్పుడు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడు. తెలంగాణ ఏర్పాడ్డాకే తమను అవమానించిన ఏబీఎన్ - టీవీ9లను నిషేధించి అందరికీ హెచ్చరికలు పంపాడు. అందుకే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పై అడ్డదిడ్డంగా రాతలు రాసే సాహసం చేయడం లేదు..
కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికే చంద్రబాబు సామాజికవర్గంలోని బడా నేతలు - వ్యాపారుల చేతుల్లోనే ఎక్కువ శాతం మీడియా ఉంది. అందుకే వారంతా ఇప్పుడు పనిగట్టుకొని బాబు జపం చేస్తున్నారని పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.
తాజాగా బాబు టార్గెట్ మోడీ.. అందుకే మోడీని ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేస్తున్నాయట ఆ పచ్చ మీడియా సంస్థలు.. ఇటీవలే ఏవో సర్వేలు చేయించి మోడీ పని ఖతమైందని కథనాలు అల్లేశారు. ఈరోజు ఓ ప్రధాన పత్రికలో అయితే ఎడిటోరియల్ లో మోడీలోని రాక్షసుడిని బయటకు తీశారు. ఇక బాబు అనుకూల న్యూస్ చానెల్స్ లో అయితే మోడీని బట్టలిప్పి నిలబెట్టేలా కథనాలు అల్లేస్తున్నారు. దక్షిణాదిలో మోడీ ఆటలు సాగవంటున్నారు. చంద్రబాబుతో విడిపోయి మోడీ మూల్యం చెల్లించుకుంటున్నాడంటున్నారు. ఇలా పచ్చ మీడియా పచ్చి రాతలకు పాపం బీజేపీ బలవుతోంది. బాబు మీడియా మేనేజ్ మెంట్ దెబ్బకు కాషాయపార్టీ కూడా కుదేలవుతోంది.