అప్పుడు సీఈవో.. ఇప్పుడు చీఫ్ కమాండర్ అంట

Update: 2016-09-29 08:41 GMT
కొన్ని మాటలు ప్రజల మనసుల్లో ముద్ర పడిపోతాయి. రాజకీయ నాయకులను అన్నగానో.. తమ్ముడిగానో.. అమ్మగానో.. అక్కగానో.. వదినగానో.. చిన్నమ్మలానో గుర్తు పెట్టుకోవటానికి ఇష్టపడతారే కానీ సీఈవోగా..  చీఫ్ కమాండర్ గా గుర్తించటానికి ఇష్టపడరు. ఒకవేళ అలాంటి పేర్లు పెట్టుకోవటం అంటే ప్రజలకు కాస్త దూరం కావటమే. గంభీరంగా ఉండే పిలుపులు ప్రజలకు దూరం చేస్తాయి. ఆ విషయాన్ని పదేళ్లు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఇప్పటికీ అర్థం కాలేదంటే ఏం చేయగలం?

తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంగా చంద్రబాబు వ్యవహారశైలి తనకు నచ్చినట్లుగా ఉండేది. ఆయన ఎవరి మాటను లక్ష్య పెట్టేవారు కాదని చెబుతారు. తనకు తాను సీఈవోగా అభివర్ణించుకోవటం తెలిసిందే. ఆయన మరో ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్య చేసి ఉండరు. కానీ.. జనాలకు ఆయన అనుకున్నట్లు కాకుండా మరోలా మాత్రమే అర్థమవుతుంది. పవర్ లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు పెద్దగా ప్రభావం చూపించవు. కానీ.. పవర్ చేజారిన తర్వాత విమర్శల పర్వం మొదలయ్యాకే అసలు ఇబ్బంది అంతా. నిన్ను ప్రజలంతా కలిసి ముఖ్యమంత్రిని చేస్తే.. నిన్ను నువ్వు సీఈవో అనుకోవటం ఏమిటి? నువ్వేమన్నా వ్యాపారం చేస్తున్నావా? అంటూ చులకనగా మాట్లాడే మాటలకు పవర్ లేనప్పుడు సమాధానం చెప్పటం.. ప్రజల్ని కన్వీన్స్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి.

పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు సీఈవో అని తనను తాను అభివర్ణించుకున్న దానికి చాలానే మాటలు పడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావటంతో ఆయన గతాన్ని మర్చిపోయినట్లున్నారు. తాజాగా ఆయన తనను తాను ఛీప్ కమాండర్ గా అభివర్ణించుకుంటున్నారు. తన నేతృత్వంలో పని ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ రూమ్ కి  తాను చీఫ్ కమాండర్ గా ఆయన చెప్పుకోవటం గమనార్హం. ఇలాంటి హోదాలు మంచి ఉద్దేశంతోనే బాబు చెప్పుకొని ఉండొచ్చు. కానీ.. ఆయనలా అందరూ అర్థం చేసుకునే అవకాశం ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

సామాన్యులకు సొంతమనిషిలా ఉండాలే తప్పించి.. ఇలాంటి కమాండర్ పోస్టులతో ఉన్న పదవికి ఎసరు పడుతుందన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. విపక్షంలో ఉన్నప్పుడు మీ పెద్దబ్బాయిగా ఉంటానని చంద్రబాబు పదే పదే చెప్పటాన్ని మర్చిపోకూడదు. పవర్ లో లేప్పుడు ఇంటి మనిషిగా ఉంటానని చెప్పిన చంద్రబాబు.. పవర్ రాగానే.. చీఫ్ కమాండర్ గా ఉంటాననటం ఏమిటి? లెక్కలో ఏదో తేడా వస్తున్నట్లు లేదు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News