చంద్రబాబు నలభై యేళ్ల అనుభవంతో చెబుతున్నారట!

Update: 2019-05-02 17:30 GMT
సినిమాల్లో 'థర్టీ  ఇయర్స్  ఇండస్ట్రీ' అనేది కామెడీ డైలాగ్. వాస్తవంలో చంద్రబాబు నాయుడు అనునిత్యం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనేదాన్ని ఊతపదంగా మార్చుకున్నారు. ఈ టాపిక్ అంటూ వదలరు. ప్రతి విషయంలోనూ  చంద్రబాబు నాయుడు తన 'నలభై యేళ్ల అనుభవం'ను వదలరు.

తనకు నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు… 'నా నలభై యేళ్ల అనుభవంతో ఇలాంటిది చూడలేదు..' అని అనడం, తను  చెప్పాలనుకున్నదాన్ని ఒత్తి చెప్పాలనుకున్నప్పుడు..’నలభై యేళ్ల అనుభంతో చెబుతున్నా..’ అనడం బాబుకు అలవాటే.

విషయం ఏదైనా 'అనుభవం, నలభై యేళ్లు' అనే పదాలను బాబు ఉపయోగించుకొంటూ వస్తుంటారు. బాబు చేసే ఈ పదప్రయోగాలను సీరియస్ గా తీసుకునే వాళ్లు సీరియస్ గా తీసుకుంటారు, జోక్ గా తీసుకునే వాళ్లు నవ్వుకుంటారు. అయితే బాబు మాత్రం ఆ మాటలను వదలరు.

ఆఖరికి ఎన్నికల్లో గెలుపు మీద విశ్వాసం వ్యక్తం చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు 'నలభై యేళ్ల అనుభవం' అనే మాటను ఉపయోగించేశారు. తెలుగుదేశం అధినేత తన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ మాటను ఉపయోగించడం ఆసక్తిదాయకంగా మారింది.

పోలింగ్ ముగిసి ఇరవై రోజులు అయ్యాకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమీక్షా సమావేశాలకు రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు తమ వాళ్లతో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

'నలభై యేళ్ల అనుభవంతో చెబుతున్నా… గెలిచేది మన పార్టీనే..' అని బాబు నొక్కి వక్కాణించారు. ఇలా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం పట్ల తను కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తూ, పార్టీనేతల్లో కాన్ఫిడెన్స్ ను పెంచే ప్రయత్నంలో ఉన్నారు!
Tags:    

Similar News