బాబు ఓటెవరికి? అశోక్ కా.. గంటాకా?

Update: 2017-05-28 06:59 GMT
ఏపీలో విజయనగరం మినహా అన్ని జిల్లాలకు టీడీపీ అధ్యక్షులను ఎన్నుకున్న సంగతి తెలిసింది. రాజకీయంగా పైకి పెద్దగా విభేదాలేమీ కనిపించని అక్కడ ఒక్క చోట మాత్రం జిల్లా అధ్యక్ష పదవి నియామకం నిలిచిపోయింది. దీనికి కారణం కేంద్ర మంత్రి అశోక్ - రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య ఈ విషయంలో విభేదాలే కారణమని తెలుస్తోంది. ఇద్దరూ తమ వారికి పదవి ఇప్పించుకోవడానికి పావులు కదుపుతున్నారు.
    
నిజానికి విజయనగరం టీడీపీలో ఇంతవరకు అశోక్ మాటను కాదని ఎలాంటి నియామకం జరిపిన సందర్భం లేదు. కానీ, ఈసారి ఎందుకో తేడా కొడుతోంది.  ఇది అశోక్ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోందని తెలుస్తోంది.  విశాఖ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న గంటాకు ఉత్తరాంధ్రలో పూర్తి పట్టు చిక్కకపోవడానికి అశోక్ ఒక కారణం. విజయనగరంలో గంటా విస్తరించలేకపోతున్నారు. దీంతో ఆయన అశోక్ ను పార్టీలో, రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అశోక్ సొంత జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిలో తన వారిని కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. అశోక్  అది సాగనివ్వకుండా ప్రయత్నిస్తున్నారు.
    
ప్రస్తుతం అశోక్ అనుచరుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షుడిగా ఉన్నారు.  ఆయన్ను తప్పించి తన వాళ్లను నియమించుకోవాలని... ఓ మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని గంటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ... అశోక్ అందుకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. చంద్రబాబు కూడా అశోక్ మాటకే విలువిస్తారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News