ప్రత్యేక హోదా మీద తేల్చేసిన బాబు
ఏపీకి ప్రాణవాయివుగా ప్రత్యేక హోదా మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టాండ్ ఏమిటి? ప్రత్యేక హోదా అవసరం అని చెప్పే చంద్రబాబే.. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక హోదా ఒక్కటే సరిపోదంటూ మాట్లాడటంపై విపక్షాలు చాలానే సందేహాలు వ్యక్తం చేస్తుంటాయి. మరి..బాబు చెప్పే మాటల్లో దేన్ని నమ్మాలి? దేన్ని ఆయన మాటగా తీసుకోవాలన్న సందేహం సీమాంధ్రుల్లో ఉంది. తాజాగా ప్రధాన మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఏపీ ప్రత్యేక హాదాకు సంబంధించిన తన స్టాండ్ ను పూర్తి స్థాయి క్లారిటీతో బాబు ఇచ్చేశారు.
ప్రత్యేక హోదా మీద తాను రాజకీయం చేయాలని అనుకోవటం లేదని.. అప్పుడు.. ఇప్పుడు ఈ వ్యవహారం మీద తన మాట ఒక్కటేనంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ వ్యవహారం మీద తన వాదనను వివరంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రత్యేక హోదా కారణంగా కొన్ని లాభాలు ఉన్న మాట వాస్తవమేనని.. హోదా వస్తే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం గ్రాంటు ఇస్తారని.. పది శాతం గ్రంటు సమకూర్చుకుంటే సరిపోతుందని చెప్పారు.
హోదా కారణంగా వచ్చే లాభంతో పాటు ఆ వ్యవహారం చుట్టూ ఉన్న అంశాల్ని బాబు మాటల్లోనే చూస్తే.. ‘‘విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుల్లోనూ 90 శాతం గ్రాంటుగా లభిస్తుంది. కానీ.. ఎన్ని ఈఏపీ ప్రాజెక్టులు ఇవ్వాలన్నది కేంద్రం ఇష్టమే. దాని కోసం కేంద్రంపైనే మళ్లీ ఆధారపడాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ఇచ్చి ఈఏపీ ప్రాజెక్టులు ఇవ్వకపోతే మనకు ఒరిగేదేంటి? ప్రత్యేక హోదా కేవలం ఈశాన్య రాష్ట్రాలకే వర్తించేలా ఈ మధ్య జీవో కూడా తెచ్చారు. ఆ రాష్ట్రాలకూ వస్తు సేవల పన్ను వస్తుంది కాబట్టి పారిశ్రామిక రాయితీలు ఇవ్వమని చెబుతున్నారు. పైగా వచ్చే మార్చితో ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పోతుంది. ఇవన్నీ వాస్తవాలు. వీటిని మరుగునబెట్టి ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రోజు పాపం చేసింది ఒక పార్టీ. కుట్రలో భాగస్వామి అయ్యింది మరో పార్టీ. ఆ రెండూ ఈ రోజు మొసలి కన్నీరుకార్చటం సరికాదు. ప్రత్యేకహోదా వస్తే ఎక్కువ ఆనందపడేవాడిని నేనే’’ అంటూ తన వాదనను వినిపించారు. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా.. ప్రత్యేక హోదా మీద బాబు స్టాండ్ ఏమిటన్న సందేహం ఎవరికైనా వస్తుందంటారా?