అమెరికాకు వెళ్తూ..జైట్లీతో భేటీతోనే అయిపోయిద్దా?
నోరు విప్పితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కోసం తానెంతగా ఆరాటపడుతున్నది.. ఏపీ అభివృద్ధి కోసం తానెంత కష్టపడుతున్నది గుక్కతిప్పుకోకుండా చెబుతారు. బాబుకు ఎంత కమిట్ మెంట్ లేకుంటే.. అమెరికా పర్యటనకు వెళ్లే వేళలోనూ.. గుర్తు పెట్టుకొని ఢిల్లీలోని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి.. ఏపీకి పెండింగ్ ఉన్న అంశాల్ని ప్రస్తావిస్తూ రెండు వినతి పత్రాలు ఇస్తారు?
విభజన నేపథ్యంలో నాటి ప్రదాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పటం.. దానిపై బాబు రియాక్ట్ అవుతూ.. తాను కానీ ఏపీ సీఎంను అయితే.. పదేళ్లు ఏంది ఖర్మ అంతకు మించిన కాలం హోదా ఏపీ దశను.. దిశను మార్చేస్తానని గొప్పాలు చెప్పుకోవటం మర్చిపోకూడదు. మోడీ ప్రధాని అయ్యాక కూడా కొద్ది నెలల పాటు హోదా మీద సినిమా చూపించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఉన్నట్లుండి కేంద్రం మార్చేసిన మాటకు తానా అంటే తందానా అన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.
హోదాను వదిలేసి.. హోదా కారణంగా ఏమేం వస్తాయో అవన్నీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వస్తాయన్న మాటల్ని తాను నమ్మటమే కాదు.. ఏపీ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. హోదాను సైడ్ ట్రాక్ కు తీసుకెళ్లేందుకు కేంద్రం వేసిన ఎత్తును విజయవంతంగా అమలు చేసేలా చేయటంలో బాబు ప్రావీణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. హోదాను బలిపెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పేసినప్పుడు.. కనీసం ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశం మీదనైనా బలంగా పోరాడాల్సిన అవసరం ఉంది.
కానీ.. అలాంటి కీలక అంశాల్ని సాధించే విషయం మీద ఏపీ ముఖ్యమంత్రి ఎంతగా దృష్టి పెట్టారో ఏపీ ప్రజలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు అదిగో.. ఇదిగో అని కేంద్రంతో పాటు.. చంద్రబాబు కూడా చెప్పేయటం.. కాలగర్బంలో రోజులు నెలలుగా.. అవికాస్తా ఏళ్లుగా మారుతున్నా.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇప్పటికి చట్టబద్దత సంతరించుకోని వైనం చూసినప్పుడు కేంద్రానికి ఏపీ పట్ల ఉన్న అభిమానం ఎంతో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.
అదే సమయంలో.. తమకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటిని.. అమెరికాకు వెళ్లే క్రమంలో ఢిల్లీకి చేరుకున్న సందర్బంగా.. రెండు లేఖల్ని కేంద్ర ఆర్థిక మంత్రికి విన్నపం రూపంలో ఇచ్చేసిన వైనం చూస్తే.. కేంద్రం లైట్ తీసుకోవటానికి అసలు లోపం ఏమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. హోదా ఇవ్వటం వల్ల ఏపీకి కేంద్రం నుంచి అదనంగా వచ్చే 30 శాతం నిధులకు తగ్గట్లు ఈఏపీల కోసం తీసుకునే రుణ మొత్తాన్ని కేంద్రమే గ్రాంట్ గా చెల్లిస్తుందని గతంలో హామీ ఇచ్చారని.. అదేమీ అమలు చేయలేదన్న విషయాన్ని జైట్లీకి బాబు గుర్తు చేశారు.
ప్యాకేజీ ప్రకటన చేసి రెండేళ్లు అవుతున్నా.. హోదా ఇస్తే వచ్చే లాభం ఎంతన్న విషయంపై కేంద్ర శాఖలు ఒక అంచనాకు రాలేకపోయాయని.. దీంతో మూడు ఈఏపీ ప్రాజెక్టులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఏడాదికి కేంద్ర ప్రాయోజితాల పథకాల ద్వారా రూ.3వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.15వేల కోట్లు వస్తుందని అంచనా వేశామని.. కేంద్ర శాఖలు తమ లెక్కల్ని తేల్చే లోపు.. తమ అంచనాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. ఐదేళ్లకు ప్రకటించిన ప్యాకేజీలు ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయని.. మిగిలిన మూడేళ్లలో రూ.15వేల కోట్ల చొప్పున ఈఏపీ ప్రాజెక్టుకలు రుణాలు పొందలేకపోవచ్చని.. అందుకే 2015 ఏప్రిల్ ముందు అవగాహన కుదుర్చుకున్న ప్రాజెక్టుల రుణభారాన్ని కేంద్రమే భరించాలన్నారు.ఏపీకి రావాల్సిన నిధుల పెండింగ్ గురించి.. సాయం గురించి జైట్లీకి నోట్ రూపంలో అడిగిన బాబు తీరు చూస్తే.. ఏపీకి వచ్చేనా అన్న సందేహం కలగక మానదు. కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని నెలల వారీగా వసూలు చేసుకోవాల్సింది పోయి.. ఏళ్లకు ఏళ్లు ఆగటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటి సందేహాలకు బాబు జమానాలో సమాధానం ఇచ్చేవారెవరు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/