• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్యేలను చూసి బాబు...

ఎమ్మెల్యేలను చూసి బాబు ముచ్చటపడిన వేళ!

By - Tupaki Desk
Update: 2016-10-05 08:20 GMT
చంద్రబాబుతో మీటింగంటే అధికారులకే కాదు ఆయన కేబినెట్లోని మంత్రులకూ గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. సాదాసీదా ఎమ్మెల్యేలయితే మరింత వణుకుతారు. ఎప్పుడు ఏ కారణంతో చీవాట్లు పెడతారో అన్న టెన్షన్ వారిది. ఆయన ఆలోచనలను - వేగాన్ని అందుకోలేకపోతున్నారని... సరిగా పనిచేయడం లేదని తరచూ మంత్రులు - ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్షింతలు వేస్తుంటారు. ఆయన ఇచ్చే ర్యాంకింగుల్లో ముందున్నవారికి నో ప్రాబ్లం.. కానీ, వెనుకబడినవారికి మాత్రం తలంటేస్తారు. అలాంటి చంద్రబాబు సడెన్ గా మంత్రులు - ఎమ్మెల్యేలను చూస్తే తనకు ముచ్చటేస్తోందని చెబితే ఎవరికైనా ఆశ్చర్యమే. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రులు బుధవారం అలాంటి ఆశ్చర్యానికే లోనయ్యారు. అమరావతి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో మంత్రులు - ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న నాయకత్వ సాధికారత సదస్సు రెండో రోజున వారితో మాట్లాడిన చంద్రబాబు ఇలా ముచ్చటపడ్డారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలకు కంప్యూటర్ ల్యాబ్ లో సీఎం డ్యాష్ బోర్డు - కైజాలా యాప్ పై శిక్షణ ఇచ్చారు. నాయకులు అలా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యార్థులుగా మారి పాఠాలు నేర్చకోవడాన్ని చూసి చంద్రబాబు తెగ ముచ్చటపడిపోయారు.. ఆ ఆనందాన్ని వారితోనే పంచుకున్నారు. వర్శిటీలోని టెక్ విద్యార్థులు చెబుతుంటే, నేతలంతా బుద్ధిగా వింటుండటం - తమకు వచ్చిన అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన చంద్రబాబు - టెక్నాలజీ పరంగా ముందుంటే ప్రపంచం మొత్తం మన ముందున్నట్టేనని అంటూనే తన పార్టీ నేతలకు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో విజయం సాధించానని చెబుతూ ఎప్పటిలాగానే దాన్ని కూడా తన విజయాల ఖాతాలో వేసుకున్నారు.

ఎవరైనా సరే అప్ డేట్ కాకుంటే అవుట్ డేట్ అయిపోతారని హెచ్చరించిన చంద్రబాబు  ఇప్పుడు నడుస్తున్న కాలంలో నూతన ఆవిష్కరణలదే ప్రధాన భూమికని, ఒక ఆలోచన ప్రపంచగతిని మార్చేస్తుందని అన్నారు భూగర్భంలో వేస్తే రూ. 3 వేల కోట్ల ఖర్చయ్యే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును - తనకొచ్చిన చిన్న ఆలోచనతో విద్యుత్ స్తంభాలపై వేయించి రూ. 300 కోట్లతో ముగించేశామని తెలిపారు. రెయిన్ గన్ లను తీసుకువచ్చి - ఎండిపోయే పంటలకు తడులు అందించామని కూడా చెప్పారు. మొత్తానికి శిక్షణ కార్యక్రమానికి చంద్రబాబు రాగానే ఏం వంక పెట్టి క్లాసు పీకుతారో అని భయపడుతున్న ఎమ్మెల్యేలకు ఆయన నాలుగు మంచి మాటలతో సంతోషింపజేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chandrababu Naidu 
  • TDP Training Programme 

Similar News

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS