అమరావతిపై కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు కౌంటర్

Update: 2019-10-09 11:00 GMT
ఆ మధ్య జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర రాజధానిలో నిర్మిస్తున్న అమరావతి నగర డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా అభివర్ణించటం తెలిసిందే. ఇదే విషయాన్ని తాను చంద్రాబాబుకు చెప్పానని.. ఆయన తన మాటల్ని వినిపించుకోలేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

అమరావతి నగర నిర్మాణం ఏ మాత్రం వర్క్ వుట్ కాదన్న విషయాన్ని నిజంగానే బాబుకు కేసీఆర్ చెప్పారా? చెబితే.. అందుకు బాబు రియాక్షన్ ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాు నోటి నుంచి కేసీఆర్ వ్యాఖ్యకు కౌంటర్ వచ్చేసింది.

కేసీఆర్ వ్యాఖ్యలకు స్పందించని బాబు.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రంతన అబిప్రాయాన్ని స్పష్టం చేశారు.  దేశంలో అత్యంత సౌకర్యవంతమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటని.. దాన్ని తాను ఆ విధంగా రూపొందించిన వైనాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో సక్సెస్ అయిన తన ఫార్ములాను అమరావతిలోనూ కొనసాగించాలని భావించినట్లు చెప్పారు.

కేసీఆర్ చెప్పినట్లుగా తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  హైదరాబాద్ ను డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా అనుకొని ఉంటే.. కేసీఆర్ ఈ రోజు ఉన్నంత హ్యపీగా ఉండేవారు కాదు. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయేలా ఐటీ నగరాన్ని నిర్మించటం వల్లే.. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటైందన్నారు. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని.. అది తనంతట తానే ఆదాయాన్ని తెచ్చుకునే మోడల్ ను తాను రూపొందించినట్లు చెప్పారు.

అమరావతి నగరంలో తక్కువలో తక్కువ లక్ష కోట్ల రూపాయిల పెట్టుబడుల్ని ఆకర్షించొచ్చని చెప్పారు. తన ముద్రలు ఏమీ లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. ఈ కారణంతోనే అమరావతిని  నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కర్ణాటకకు బెంగళూరు మాదిరి.. తెలంగాణకు హైదరాబాద్ మాదిరి.. ఏపీకి కూడా ఒక మహా నగరం అవసరం ఉందన్నారు. అమరావతిని నాశనం చేయాలని భావిస్తే.. చరిత్ర ఎప్పటికి క్షమించదంటూ గుస్సా అయ్యారు.



Tags:    

Similar News