బాబు కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా?

Update: 2019-04-15 11:28 GMT
 అన్నం మొత్తాన్ని కాదు.. మెతుకు ఒక్క‌దాన్ని చూస్తే చాలు దాని బ‌తుకేందో చెప్పేయొచ్చంటారు. ఈ సామెత‌కు త‌గ్గ‌ట్లే తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్న గెలుపు లెక్క‌లు ఇదే తీరులో ఉన్నాయి. రాజ‌కీయ‌పార్టీలు అన్నాక‌.. అందులోకి అధికార‌ప‌క్ష‌మైన‌ప్పుడు గెలుపు మీద ధీమాను వ్య‌క్తం చేయ‌టం త‌ప్పేం కాదు. కానీ.. స‌మ‌స్య ఏమిటంటే.. త‌మ‌కొచ్చేసీట్ల విష‌యంలో బాబు చెప్పిన లెక్క‌ను చూసి ముక్కున వేలేసుకోవ‌టం క‌నిపించింది.

ఎందుకంటే.. ఎక్క‌డైనా ఎన్నిక‌ల్లో గెలిచే సీట్ల‌ను చెప్పే ట‌ప్పుడు రెండు ఫిగ‌ర్ల‌ను చెప్ప‌టం.. వాటి మ‌ధ్య తేడా మ‌హా అయితే ప‌ది సీట్లకు మించి ఉండ‌న‌ట్లుగా ఉంటుంది. అందుకు భిన్నంగా బాబు మాత్రం తానుచెప్పిన క‌నిష్ఠ సీట్ల‌సంఖ్య‌కు.. గ‌రిష్ఠ సీట్ల సంఖ్య‌కు మ‌ధ్య తేడా భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు ప‌క్కా అని..నూటికి వెయ్యి శాతం త‌మ‌దే గెలుపు అంటూ ఆయ‌న బ‌ల్ల గుద్ది న‌మ్మ‌కంగా చెబుతున్నారు. తాజాగా నిర్వ‌హించిన వీడియో స‌మావేశంలో ఏమేం అంశాల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. పార్టీ శ్రేణుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా బాబు ఏం చెప్పార‌న్న‌ది చూస్తే..
+  ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సర్వే గెలిచేది తెలుగుదేశం పార్టీయే అన్నాయని, తెదేపా గెలుపు 1000 శాతం తథ్యం.

+  తెదేపా పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే.

+  ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్ట‌టానికే టీడీపీ పోరాడుతుంది

+   టీడీపీ శ్రేణులన్నీ సంఘటితంగా పనిచేశాయని, అందుకే ఈ ఎన్నికలో మ‌న గెలుపు ఏకపక్షం.

+  టీడీపీ గెలుపు అడ్డుకోవ‌టానికి అనేక కుట్ర‌లు చేశారు. వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాం.

+  తెలంగాణ‌లో 25 లక్ష‌ల ఓట్లు తొల‌గించార‌ని.. ఏపీలో 8 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించేందుకు కుట్ర ప‌న్నారు

+  స‌కాలంలో స్పందించి ఓట్ల తొల‌గింపు కుట్ర‌ల్ని భ‌గ్నం చేశాం

+  ఐపీ అడ్రస్‌లు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా అడ్డుప‌డుతున్నారు.

+  పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్‌ రిపేర్ వస్తే.. కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టామన్నారు.

+  శాంతి భద్రత సమస్యలు సృష్టించే కుట్రలు చేశారు. భాస్కర రెడ్డి హత్య, స్పీకర్‌పై దాడి, మహిళా అభ్యర్థులపై దౌర్జాన్యాలు చేశారు.
4

+  తప్పులు చేసి ప్రజాతీర్పు కాలరాయాలని చూశారు.

+  చెన్నై, షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి భారీగా తరలివచ్చి టీడీపీకి అనుకూలంగా ఓటేశారు.

+  బ‌య‌ట నుంచి వ‌చ్చి.. పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నవారికి అభినందనలు.

+  వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చిన ఘనత టీడీపీదే.

+  ఎన్నికల సంఘంపై 15 ఏళ్లుగా తెదేపా పోరాడుతోంది.  ఈవీఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరాయి.

+  ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్క క్షమాపణతో సరిపెడతారా?

+  50 శాతం వీవీ ప్యాట్ రశీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరం?  తెలంగాణలో పోలైన ఓట్ల కన్నా, ఈవీఎంలలో ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయి?

+  గతంలో బ్యాలెట్ విధానంలో పోల్ అయిన ఓట్లన్నీ ట్యాలీ అయ్యేవి. టెక్నాలజీ వచ్చాక ట్యాలీ కావడం లేదే?
   

Tags:    

Similar News