సీఎం జగన్ కు కొత్త పేరు పెట్టిన చంద్రబాబు

Update: 2020-12-10 04:43 GMT
తరచూ ఏదో ఒక సంక్షేమ పథకాన్ని తెర మీదకుతీసుకురావటమే కాదు.. తన పాలనలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్న తపనతో పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విపక్ష నేత చంద్రబాబు దూకుడు వ్యాఖ్యలు చేశారు. యువనేతకు కొత్త బిరుదును కట్టబెట్టే ప్రయత్నం చేశారు. తరచూ ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించే జగన్ ను పట్టుకొని.. పన్నుల ముఖ్యమంత్రిగా..సుంకాల సీఎంగా అభివర్ణించిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. కడప పార్లమెంటునేతలతో జరిపిన రివ్యూ సందర్భంగా జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

పంచాయితీ ఎన్నికలు వద్దంటే కావాలన్నారని.. ఇప్పుడు ఎన్నికలు అందరూ నిర్వహిస్తుంటే.. సీఎం జగన్ మాత్రం వద్దంటే వద్దని చెబుతున్నారన్నారు. వ్యవస్థలన్నా.. న్యాయస్థానాలన్నా సీఎం జగన్ కు లెక్క లేదన్న బాబు.. ‘ఇతనొక వింత ముఖ్యమంత్రి. వితండ ముఖ్యమంత్రి. విధ్వంస ముఖ్యమంత్రి’’ అని మండిపడ్డారు. అదే పనిగా ప్రతి దానిపైనా పన్నులు వేస్తున్నారంటూ జగన్ తీరును తప్పుపట్టారు.

పట్టణ ప్రాంతంలో ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్నింటిపైనా పన్ను.. రోడ్ల మీదా.. ఫుట్ పాత్ ల మీదా ఇలా ప్రతి ఒక్కదానిపైనా పన్ను.. పన్ను విధించటమే పని అన్నారు. ‘ఇతనో పన్నుల ముఖ్యంత్రిగా మారారు. సుంకాల సీఎంగా తయారయ్యారు. ప్రజలకు భారమయ్యారు’ అని మండిపడ్డారు. ఓవైపు బోలెడన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంటే.. పన్నులు బాదేస్తున్నారంటూ బాబు చెబుతున్న మాటలకు ఏపీ ప్రజలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News