కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి
ఏపీలో కరోనా తీవ్రత తగ్గడం లేదు. రోజుకు 10వేల కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడుతున్నారు.
తాజాగా టీడీపీని మరో విషాదం వెంటాడింది. పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనాతో కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోవడం విషాదం నింపింది.
గత పదిరోజులుగా విజయవాడ ప్రబుత్వ ఆసుపత్రిలో రామాంజనేయులు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాలుగురోజులుగా వెంటిలేటర్ పై చికిత్స అందించారు.
తాజాగా ఈ ఉదయం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. అక్కడనే ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
కాగా రామాంజనేయులు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర తీవ్ర సంతాపం తెలిపారు.