పనిమనిషికి అపాయింట్ మెంట్ లెటర్..?
ఇంట్లో అంట్లు తోమటానికి.. ఇల్లు తుడవటానికి పని మనిషిని పెట్టుకోవటం కామనే. ఇప్పటి మాదిరి నచ్చిన పని మనిషిని పెట్టుకోవటం.. వద్దనుకుంటే మాన్పించేయటం లాంటివి రానున్న రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. అంతేకాదు.. కొత్త పనిమనిషిని పనిలో పెట్టుకోవటం ఇప్పుడున్నంత సులభం కాకపోవచ్చని చెబుతున్నారు.
రానున్న రోజుల్లో పని మనిషిని పెట్టుకోవటం పెద్ద ప్రయాసే అన్న వాదన జోరుగా వినిపిస్తోంది. ఈ మాటలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. కేంద్ర కార్మిక శాఖ కొంగొత్తగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకూ ఏ మాత్రం లెక్కలోకి రాకుండా ఉన్న ఈ వర్క్ ఫోర్స్ కు సంబంధించి కేంద్రం చేస్తున్న ఆలోచనలు వాస్తవ రూపం దాలిస్తే.. మొత్తం వ్యవహారం మారిపోతుందని భావిస్తున్నారు.
దేశంలోని 90శాతం పని మనుషులు ఇంటి మనుషుల లెక్కలో పని చేస్తున్నారు తప్పించి.. వారికి ప్రత్యేకమైన గుర్తింపు.. వారి హక్కుల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని.. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశ వ్యాప్తంగా ఇంటి పని.. వంట పని.. తోట పని చేసే శ్రామిక వర్గాలకు సంబంధించిన గణాంకాలు ఏమీ లేవని.. ఇదంతా వ్యక్తిగతంగా సాగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ తీరును మార్చాలని భారత సర్కారు భావిస్తోంది. కేంద్రం అనుకున్నట్లుగా జరిగితే.. పని మనుషులకు సైతం అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వటంతో పాటు.. ఒక ఉద్యోగికి సంబంధించి పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ చాలానే తెరపైకి వస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే.. పని మనిషిని ఇప్పుడు పెట్టుకున్నంత ఈజీగా వ్యవహారాలు ఉండవని చెబుతున్నారు. ప్రస్తుతం ఆలోచనల స్థాయిలో ఉన్నది కార్యరూపం ఎప్పుడు దాలుస్తుందో..?