ట్విట్టర్ కి కేంద్రం నోటీసులు !

Update: 2020-11-13 12:10 GMT
లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌ లో చూపకుండా జమ్మూకాశ్మీర్‌‌ లో చూపించిన నేపథ్యంలో ట్విట్టర్‌ కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరపర్చినందుకు మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ట్విట్టర్ ‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిస్ ఇచ్చింది. ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహంగా ఉంది. అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలకు ట్విట్టర్ స్పందించకున్నా, అది ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని భారతప్రభుత్వం భావిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ట్విట్టర్ కార్యకలాపాలను నిలిపివేయడం, లేదంటే కనీసం ఆరు నెలల జైలు శిక్ష పడేలా పోలీసు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ మద్యే  లడఖ్ ను  ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, దానికి లేహ్‌ ను రాజధానిగా చేసింది. ట్విట్టర్ మాత్రం లేహ్‌ను చైనాలో భాగంగా చూపించడంతో దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో పటంలో మార్పులు చేయడంతో లేహ్ ను జమ్మూకశ్మీర్‌లో భాగంగా చేసింది. దీంతో ప్రభుత్వం మరోమారు మండిపడింది. ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. లేహ్ రాజధానిగా లడఖ్ ను ప్రత్యేక యూటీగా పార్లమెంట్ ప్రకటించిందని, మ్యాప్ లో దానిని తప్పుగా చూపడం ద్వారా పార్లమెంట్ సార్వభౌమ నిర్ణయాన్ని తక్కువ చేయడమేనన్నారు.
Tags:    

Similar News