కేసీయార్ చేసిందే కేంద్రం చేసిందా ?
ఇపుడిదే విధమైన చర్చ నడుస్తోంది. వరి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఢిల్లీలోకి వచ్చిన తమను కేంద్రం అవమానించిందని మంత్రులు, ఎంపీలు మండిపోతున్న విషయం తెలిసిందే.
రైతుల కోసం వస్తే తమను బిచ్చగాళ్ళలా చూస్తారా ? అంటు మంత్రులు, ఎంపీలు హూంకరిస్తున్నారు. విచిత్రమేమిటంటే ఇప్పటికే కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఒకసారి తెలంగాణా మంత్రులు, ఎంపీలతో సమావేశమయ్యారు. అయితే సమస్య పరిష్కారం కానికారణంగా వీళ్ళంతా ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.
అయితే సమావేశమైన సందర్భంలో కూడా గోయెల్ మంత్రులు, ఎంపీలను చాలా సేపు వెయిట్ చేయించారని వీళ్ళు గోల చేస్తున్నారు. అసలు తన అపాయిట్మెంట్ తీసుకోకుండా వచ్చి గోల చేయటం ఏమిటని కేంద్రమంత్రి గట్టిగానే తగులుకున్నారు. తమిష్టానికి తాము వచ్చేస్తే కలవటానికి తానేమీ ఖాళీగా లేను కదా అంటు గోయెల్ రివర్స్ దాడి మొదలుపెట్టారు. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్షాలు వివాదంలోకి ఎంటరయ్యాయి.
రాష్ట్రంలో తమ విషయంలో కేసీయార్ ఏమి చేస్తున్నారో మంత్రులు, ఎంపీలకు గుర్తు చేస్తున్నాయి. వివిధ కారణాలతో కేసీయార్ అపాయిట్మెంట్ తీసుకుని కూడా గంటల తరబడి వెయిట్ చేసిన సందర్భాలను ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
గంటల తరబడి వెయిట్ చేసినా చివరకు తమను కలవకుండానే కేసీయార్ బయటకు పంపేసిన ఘటనలను ప్రతిపక్షాలు గుర్తు చేసుకుంటున్నాయి. తమకు కేసీయార్ ఏమి చేస్తున్నారో అదే పద్దతిలో కేంద్రం తెలంగాణా మంత్రులు, ఎంపీల విషయంలో అనుసరిస్తోందన్నారు.
కేంద్రమంత్రి అపాయిట్మెంట్ తీసుకోకుండా ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణా మంత్రులు, ఎంపీలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అయినా ఒకసారి వీళ్ళతో గోయెల్ భేటీ అయిన విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుచేస్తున్నాయి. మొదటినుండి రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ ను కొనేదిలేదని కేంద్రం చెబుతున్నా కేసీయారే పట్టించుకోవటం లేదన్నారు. ఇపుడు బాయిల్డ్ రైస్ అంశం తన మెడకు చుట్టుకోవటంతో దాన్ని కేంద్రానికి చుట్టాలని కేసీయార్ ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షాలు మండిపోతున్నాయి. చివరకు ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.